కెన్యా నుండి వచ్చిన 22 ఏళ్ల మహిళమూడు నెలలుగా కొనసాగుతున్న ఎడమ ప్రక్క నొప్పితో పేస్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ బ్రాంచ్‌ను ఆశ్రయించారు. పేషెంట్‌కు చేసిన పరిశీలనల్లో, ముఖ్యంగా CT-KUB స్కాన్‌లో, ఎడమ మూత్రపిండంలో సుమారు1.5 సెం.మీ పరిమాణంలో రాయిఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల పేషెంట్‌కు రోజువారీ జీవనంలో తీవ్రమైన అసౌకర్యం ఏర్పడిందని వైద్యులు తెలిపారు.పేషెంట్ పరిస్థితిని విశ్లేషించిన పేస్ హాస్పిటల్స్ యూరాలజీ విభాగం,సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు&రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ విశ్వంభర్ నాథ్ గారి మార్గదర్శకత్వంలో,కన్సల్టెంట్ యూరాలజిస్టులు డాక్టర్ అభిక్ దేబ్‌నాథ్మరియు డాక్టర్ కె రవిచంద్రగార్లు కలిసితగిన చికిత్సా విధానాన్ని నిర్ణయించి “ఎడమ వైపు పెర్క్యూటేనియస్ నెఫ్రోలిథోటమీ (LEFT PCNL) మరియు డబుల్ J స్టెంట్ అమరిక (DJS)”ను విజయవంతంగా నిర్వహించారు.
పేషెంట్‌ను ప్రోన్ పొజిషన్‌లో ఉంచి శస్త్రచికిత్స ప్రారంభించారు. సుప్రాకోస్టల్ పంక్చర్ చేసి, ఎడమ మూత్రపిండంలో ఉన్న సుమారు 1.5 సెం.మీ పరిమాణంలోని రాయిని గుర్తించారు. రాయిని పూర్తిగా విరగగొట్టి తొలగించారు. అనంతరం 5Fr/26cm పరిమాణంలోని డబుల్ J యూరేట్రిక్ స్టెంట్‌ను అమర్చారు. మొత్తం ప్రక్రియ శాంతంగా, ఎలాంటి శస్త్రచికిత్సా లేదా శస్త్రానంతర సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యింది.
చికిత్స అనంతరం పేషెంట్ హీమోడైనమికల్‌గా స్థిరంగా ఉన్నారు. అవసరమైన ఆసుపత్రి పర్యవేక్షణ తర్వాత డిశ్చార్జ్ చేస్తూ, నొప్పి నియంత్రణ, ఇన్ఫెక్షన్ నివారణ, మరియు ఆహార నియమాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అలాగే తక్కువ ఉప్పు, తక్కువ ఆక్సలేట్, తక్కువ యూరిక్ యాసిడ్ ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అభిక్ దేబ్‌నాథ్ మాట్లాడుతూ—
“పేషెంట్‌కు నెలల తరబడి ఉన్న నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించడం మా ప్రధాన లక్ష్యం. మా బృందం సమన్వయంతో చికిత్స వేగంగా, సురక్షితంగా పూర్తయింది. పేషెంట్ త్వరగా కోలుకోవడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. ప్రతి పేషెంట్ స్థితిని అర్థం చేసుకొని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాము. అంతర్జాతీయ పేషెంట్ లు మా మీద ఉంచుతున్న నమ్మకం మా సేవలను మరింత మెరుగుపరచడానికి ప్రేరణగా పని చేస్తోంది. పేస్ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత, మరియు నిశితమైన వైద్య సేవలు ఈ విజయాలకు ఆధారంగా నిలుస్తున్నాయి.”
ఈ కేసు పేస్ హాస్పిటల్స్ యూరాలజీ విభాగం రీనల్ స్టోన్ ట్రీట్మెంట్‌లో ఉన్న ఆధునిక వైద్య పద్ధతులు, అనుభవజ్ఞులైన వైద్యుల నైపుణ్యం మరియు అంతర్జాతీయ పేషెంట్లకు నమ్మకంగా, నైపుణ్యంతో చికిత్స అందించే ప్రముఖ కేంద్రంగా పేస్ హాస్పిటల్స్ స్థిరపడుతున్నదనే విషయాన్ని ఈ కేసు స్పష్టంగా తెలియజేస్తుంది.
మరింతసమాచారంకోసంసంప్రదించండి:
PACE హాస్పిటల్స్ – హైదరాబాదు, తెలంగాణ, ఇండియా
ఫోన్లేదావాట్సాప్: 040 48486868