పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. వివిధ రాజకీయపార్టీ అధికార నివాసాలు, పార్టీ కార్యాలయాల అద్దెలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి అద్దెతో పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పెద్ద మొత్తంలో బకాయిపడింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఈ వివరాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వం. వివిధ పార్టీల నాయకులకు ప్రభుత్వపరంగా ఇచ్చే ఇళ్లకు నిర్ణీత సమయం తర్వాత అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే, […]
చిన్నప్పటినుంచి చెస్ అంటే ఇష్టం ఏర్పడింది… చెస్ లో అద్బుత ప్రతిభ చూపిస్తూ పతకాల మీద పతకాలు సాధిస్తుంది…రాష్ట్రంలో మూడో ఉమెన్ ఫిడే మాస్టర్ గా అవతరించింది… ఇండియా నెంబర్ వన్ కావడంతోపాటు ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. చెస్ ఆడుతూ అద్భుతమయిన ప్రతిభ కనబరుస్తోంది మౌనిక అక్షయ. ఊరు గుంటూరు. తల్లితండ్రులు రామారావు, లక్ష్మిలు. ఇద్దరూ కలిసి స్కూల్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు చెస్ ఆడడం చూసిన మౌనిక అక్షయ ఆ ఆటపై ఎంతో […]
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే..అర్హత లేకున్నా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్, వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారని, సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఛైర్మన్ గా ఉంటూ నలుగురు అర్హులకు పెన్షన్ల కోసం సిఫారసులు చేయాల్సింది పోయి ఆయనే పెన్షన్ తీసుకోవటమేంటని విమర్శలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్ చల్లా అంకులు, నెలా నెలా వృద్ధాప్య పింఛను అందుకుంటున్న విషయం జిల్లాలో […]
వారిద్దరూ మిత్రులు కాదు. అలా అని శత్రువులు కారు. ఒకరు అధికారపార్టీ అని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే. ఇంకొకరు టీడీపీ నేత. అకస్మాతుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దెప్పిపొడుపు మాటలతో తమలోని కళను బయటపెడుతున్నారు. ఆ గిల్లికజ్జాల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దూషణతూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని రాజోలు రాజకీయాలు ఒక్కసారిగా వాడీవేడిగా మారిపోయాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది. […]
గ్రామాల విలీనం పూర్తయింది. డివిజన్ల ముసాయిదా విడుదలైంది. అధికార, విపక్ష పార్టీలలో ఆధిపత్యపోరుకు మాత్రం చెక్ పడలేదు. వరసగా నాలుగోసారి పాగా వేయాలని ఒక పార్టీ.. తొలిసారి జెండాను రెపరెపలాడించాలని మరొకపార్టీ కలలు కంటున్నా క్షేత్రస్థాయిలోని పరిస్థితులు భిన్నంగా ఉన్నాయట. రాజమండ్రి వైసీపీ, టీడీపీ నేతల్లో ఐక్యత లేదా? గోదావరి తీరంలోని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం వేడెక్కుతోంది. విలీన గ్రామాల సమస్య కోర్టులో ఉండటంతో మొన్న ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ముసాయిదా విడుదల కావడంతో స్పీడ్ […]
ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఆత్మహత్యకు చీరాల వన్‌టౌన్ సిఐ రాజమోహనే కారణమంటూ రవీంద్రబాబు అనే వ్యక్తి తీసిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. చీరాల బోస్‌నగర్‌కు చెందిన రవీంద్రబాబు గత నెల 19న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతికి అప్పుల బాధ కారణమంమూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రవీంద్రబాబు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో దొరకడంతో అసలు విషయం బయటకు […]
హరిద్వార్ పవిత్ర కుంభమేళ మీద కరోనా మహమ్మారి పంజా విసిరింది. రోజువారీ రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. పలువురు సాధువులకు కరోనా సోకింది. ఈనెల 27న మరోసారి షాహీస్నాన్ ఉండడంతో.. కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో కుంభమేళా ముగించకపోవడంపై.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తుండడంతో… రాకాసి వైరస్ విస్తరిస్తోంది.కుంభమేళాలో పాల్గొన్న 30 మంది నాగసాధువులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆల్ ఇండియా అఖాడా […]
విశాఖ జిల్లా పెందుర్తి జుత్తాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ నుండి ఘటన స్థలానికి విజయ్ చేరుకున్నాడు. తన కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న అప్పలరాజు కుటుంబాన్ని వదలనుంటూ కేకలు వేసినట్లు చెబుతున్నారు. అప్పలరాజు ఇంటి మీదకి వెళ్ళడంతో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆపేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్య పిల్లలను పట్టుకుని బోరున విజయ్ విలపించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా కుటుంబం నాశనం చేసిన అప్పలరాజు ఇంట్లో ఎవరిని వదలనని, నా భార్య […]
నటి త్రిష 60వ చిత్రం ఓటీటీలో సందడి చేస్తున్నది అని Cine Chit Chat పేర్కొన్నది. . ‘పరమపదం వెలయాట్టు’ పేరుతో రూపొందిన ఈ చిత్రం నిజానికి గత ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావలసింది. రకరకాల కారణాలతో పాటు కరోనా, లాక్ డౌన్ వల్ల ఇప్పటికి… అదీ డిజిటల్ లో విడుదలైంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీహాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్సాన్స్ లభిస్తోంది. కె. తిరుజ్ఞానం దర్శకత్వం వహించిన ఈ […]
ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోయేలా కనిపిస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. టీడీపీకి ఆ పార్టీ నేతలే భస్మాసురుల్లా మారారని…వారి చేష్టలతో అక్కడ ఎవరూ ఉండలేరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉన్న ఒకరిద్దరు పోతే…మిగిలిన వాళ్ళు బీజేపీలోకి ..ఇతర పార్టీల్లోకి పోయేలా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. బలమైన ప్రతిపక్షం ఉండాలి అని తాము అనుకుంటున్నా కానీ…టీడీపీకి ఆ హోదా కూడా దక్కేలా లేదని.. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోవడానికి కూడా టీడీపీకి శక్తి ఉండదన్నారు […]