ఎమ్మెల్యే నుంచి మంత్రిగా పదోన్నతి పొందిన ఫైర్‌బ్రాండ్‌కు పూలు.. ముళ్లు తప్పవా? ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్కగా రాజకీయం ఉంటుందా? ఇన్నాళ్లూ ఆమెను ఫ్లవర్‌గానే చూసిన పార్టీలోని ప్రత్యర్థులకు ఇకపై ఫైర్ చూపిస్తారా? నగరి వైసీపీలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారా? చిత్తూరు జిల్లాలోని వైసీపీ రాజకీయాలు ఒక తీరున ఉంటే.. నగరిలో మరోలా ఉంటాయి. అక్కడ నుంచి వరసగా రెండోసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. ప్రస్తుతం మంత్రి అయ్యారు. అధికారపార్టీ ఎమ్మెల్యేగా […]
కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. […]
అది విదేశీ పక్షులకు నెలవు. అక్కడకు ప్రతి ఏటా విదేశీ పక్షులు రావడం.. ఇక్కడనే గుడ్లను పెట్టి పొదిగి.. వాటిని పెంచి.. ఆ పిల్లలతో సహా ఇక్కడ నుంచి మళ్లీ తమ ప్రదేశాలకు వెళ్లడం ప్రతి యేటా సాగుతుంది. అయితే అవి నివాసం ఉంటున్న చింత చెట్లు లేక.. మరోవైపున కోతుల బెడదతో ఆ గ్రామానికి విదేశీ పక్షుల రాక బంద్ అయింది.. అటు పర్యాటక గ్రామంలో తయారుచేస్తామన్న అధికారుల మాటలు నీటి మూటలుగా తయారయ్యాయి. ఖమ్మం […]
మనదేశం వివిధ పండుగలు, వేడుకలు, సంప్రదాయాలు, ఆటలకు వేదిక. హోళీ పండగ అందరికీ రంగుల పండగ. కులమతాలకు అతీతంగా అందరూ కలసి రంగులు జల్లుకుని ఆనందంగా జరుపుకునే పండగ. కానీ అక్కడ హోళీ అంటే పిడిగుద్దులకు ప్రత్యేకం. జనం రెండు వర్గాలుగా విడిపోయి కొద్దిసేపు పిడిగుద్దులు గుద్దుకుంటారు. ఆతరువాత అందరూ ఆనందంగా అలయ్ బలయ్ చేసుకుంటారు. రంగులు జల్లుకొమ్మంటే పిడిగుద్దులు ఎందుకు అని అంటే అది తరతరాలుగా వస్తున్న మా సాంప్రదాయం అని చెబుతున్నారు వారు. కొన్నేళ్లుగా […]
ఇప్పుడు ప్రపంచమంతటా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన స్టయిలే వేరంటున్నారు. పుతిన్ మాటలకు అర్థాలే వేరు?పుతిన్ యస్ అన్నాడంటే..అది నో….నో అన్నాడంటే అది పక్కా ఎస్. మాట ఒకటి…చేత ఇంకోటి. మొన్న క్రిమియాపై అదే బాట. ఆ తర్వాత డాన్ బాస్ పై అదే పాట. ఉక్రెయిన్ వార్ పై అదే తీరు. ఇప్పుడు లేటెస్టుగా ఆయన నోటి నుంచి జాలువారిన మరో డైలాగ్ బాంబ్, అణ్వస్త్ర సంసిద్ధత. మరి రష్యా అధ్యక్షుడి […]
ఒక్క విగ్రహావిష్కరణ అధికారపక్షం నేతల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన ఘర్షణ ఖమ్మం జిల్లాలో చినికి చినికి గాలి వానగా మారుతోంది. టీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాలు బాహా బాహికి గత రాత్రి దిగగా.. ఆ దాడుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ద్రోహం చేసిన వ్యక్తి రేగా అంటూ మాజీ ఎంఎల్ఎ పాయం ఆరోపిస్తుండగా పొంగులేటి పార్టీ బయటకు వెళ్లి పర్యటనలు చేయాలని రేగా కాంతారావు అంటున్నాడు. […]
ప్రజా సమస్యల కోసం లీగల్ కేడర్ ఒకవైపు, అజ్ఞాత దళాలు మరొకవైపు కలిగివున్న బలమైన నక్సల్స్ పార్టీ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. ఇల్లందు నియోజక వర్గం దానికి పట్టుకొమ్మ. అలాంటి బలం కలిగిన న్యూ డెమోక్రసీ పార్టీ చీలికలు పీలికలుగా విడిపోయింది, అందులో నుండి మళ్లీ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రజాపంథా పేరుతో మరో నక్సలైట్ పార్టీ నూతనంగా ఆవిర్భవించింది. న్యూ డెమోక్రసీ పార్టీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బలమైన కేంద్ర బిందువు. […]
తొందరపడి కోయిల ముందే కూసినట్టుగా ఆయన తీరు ఉందా? అక్కడ నుంచి పోటీ చేయాలని తెగ ఉబలాట పడుతున్నారా? ఇది ఆయనకు వచ్చిన ఆలోచనేనా లేక.. పార్టీ చెప్పిందా? అన్నింటికీ సిద్ధపడే మాట్లాడేస్తున్నారా? ఇంతకీ ఎవరా నాయకుడు? గజ్వేల్‌లో వంటేరు ప్రతాప్‌రెడ్డి తీరుపై చర్చతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అసెంబ్లీలో 100కు పైగా శాసనసభ్యుల బలం ఉంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆశావహులు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ […]
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 కు రంగం సిద్ధం అయింది. కరోనా ఇబ్బందులు వున్నా జాతర నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. జాతర జరుగుతుందో లేదో అని భక్తుల్లో ఉన్న అపోహలను మంత్రులు తొలగించారు. ఈ సారి గరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్, డీజీపీ ప్రకటించారు. మేడారం జాతర నిర్వహణ తో […]
సంచలనం కలిగించిన బిట్‌ఫినిక్స్ హ్యాకింగ్ కేసు కొలిక్కి వచ్చింది. 2016 బిట్‌ఫినిక్స్ హ్యాకింగ్ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. 3.6 బిలియన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇలియా లిక్టెన్‌స్టెయిన్, హీథర్ మోర్గాన్ జంటను కటకటాల వెనక్కి పంపారు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ అధికారులు. 2016లో హాంకాంగ్‌కు చెందిన బిట్‌ఫినెక్స్ అనే బిట్‌కాయిన్ ఎక్స్‌ఛేంజిలో హ్యాకింగ్ జరిగింది. ఆ సమయంలో లక్షా19వేల 754 బిట్‌కాయిన్లను హ్యాకర్లు అపహరించారు. […]