ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోయేలా కనిపిస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. టీడీపీకి ఆ పార్టీ నేతలే భస్మాసురుల్లా మారారని…వారి చేష్టలతో అక్కడ ఎవరూ ఉండలేరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉన్న ఒకరిద్దరు పోతే…మిగిలిన వాళ్ళు బీజేపీలోకి ..ఇతర పార్టీల్లోకి పోయేలా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. బలమైన ప్రతిపక్షం ఉండాలి అని తాము అనుకుంటున్నా కానీ…టీడీపీకి ఆ హోదా కూడా దక్కేలా లేదని.. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోవడానికి కూడా టీడీపీకి శక్తి ఉండదన్నారు ఆయన. తిరుపతిలో ఏదో జరిగిపోతోందంటూ టీడీపీ నేతలు గొడవ గొడవ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈనెల 17 న జరగబోయే ఎన్నికల్లో తిరుపతిలో నాలుగు లక్షల మెజార్టీతో వైసీపీ గెలబోతోందంటూ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు, ఆయన అనుచరగణం మతిస్థిమితం లేని వారులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు చెప్పిన తెల్లారి..టీడీపీ నేతలు సీరియస్ గా ప్రచారం చేసుకున్నారని.. అసలు వారి ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. భయపడి సీఎం జగన్ ప్రచారానికి రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని..ప్రజలకు జగన్ రాసిన లేఖ చూసైనా మీకు విజ్ఞత లేదా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఎందుకో గాబరా పడిపోతున్నారని..17వ తేదీ తర్వాత టీడీపీ పనైపోతుందని అచ్చెన్నాయుడే చెబుతున్నారు..ఇప్పటికైనా తప్పుడు ఆలోచనలు పక్కనపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలని సూచించారు ఆయన సూచించారు.