విశాఖ జిల్లా పెందుర్తి జుత్తాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ నుండి ఘటన స్థలానికి విజయ్ చేరుకున్నాడు. తన కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న అప్పలరాజు కుటుంబాన్ని వదలనుంటూ కేకలు వేసినట్లు చెబుతున్నారు. అప్పలరాజు ఇంటి మీదకి వెళ్ళడంతో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆపేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్య పిల్లలను పట్టుకుని బోరున విజయ్ విలపించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా కుటుంబం నాశనం చేసిన అప్పలరాజు ఇంట్లో ఎవరిని వదలనని, నా భార్య పిల్లలు చనిపోయిన ఈ ఇల్లు ఇంకా నాకు స్మశానం తో సమానం అని అన్నారు. అప్పలరాజు కుటుంబాన్ని అంతమోందించే వరకు నిద్రపోనని, ఏదైనా గొడవ ఉంటే నాతో పెట్టుకోవాలి, నా భార్య పిల్లలు ఏం పాపం చేశారు ? అని ప్రశ్నించారు.
విజయ్ టార్గెట్ గా జరిగిన ఆరు హత్యలు
విజయ్ గత నాలుగు నెలలుగా అత్తారింటిలో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారని గుర్తించారు. చుట్టుగుంట విశాలాంధ్ర నగర్ లో విజయ్ కుటుంబం నివసిస్తున్న నేపథ్యంలో స్థానికంగా విజయ్ సెల్ ఫోన్లకు గొరిల్లా గ్లాస్ వేసే పని చేస్తున్నట్టు గురింత్చారు. నాలుగు నెలలుగా అప్పల రాజు కుటుంబంతో తీవ్ర స్థాయిలో విజయ్ కి వివాదాలు మొదలైనట్టు చెబుతున్నారు. హత్య జరిగినప్పుడు విజయవాడలో ఉన్న విజయ్ ఉదయం హత్యలు జరిగాక బయలుదేరి జుత్తాడ చేరుకున్నాడు.
పెళ్లి కార్డులు పంచటానికి వెళ్లి హత్యకు
పెళ్లి కార్డులు పంచటానికి వెళ్లి విజయ్ కుటుంబం హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఆరు నెలలుగా బెజవాడలో అత్త రమాదేవితో కలిసి విజయ్ కుటుంబం ఉంటున్నట్టు గుర్తించారు. విజయ్ అన్న కొడుక్కి చిన్నత్త అరుణ కుమార్తె లీలావతికి మే 14న వివాహం నిశ్చయం అయింది. పెళ్లి కార్డులు ఇచ్చి పెళ్లి బట్టలు కొనటానికి విజయ్ తండ్రి రమణ ఇంటికి విజయ్ కుటుంబ సభ్యులు వెళ్లినట్టు సమాచారం. అయితే సెల్ ఫోన్లకు గొరిల్లా గ్లాస్ లు వేసే పని చేసే విజయ్ వెళ్లకపోవడంతో అతని ప్రాణాలు నిలిచారు. విజయ్ తండ్రి రమణ మినహా హత్యకు గురైన ఐదుగురు బెజవాడ విశాలాంధ్ర నగర్ వాసులేనం చెబుతున్నారు. దీంతో ఈ ఉదంతంతో విశాలాంధ్ర నగర్ లో విషాదం నెలకొంది.