Rent Problems: కాంగ్రెస్ నేతలకు అద్దె కట్టే డబ్బుల్లేవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. వివిధ రాజకీయపార్టీ అధికార నివాసాలు, పార్టీ కార్యాలయాల అద్దెలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి అద్దెతో పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పెద్ద మొత్తంలో బకాయిపడింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఈ వివరాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వం. వివిధ పార్టీల నాయకులకు ప్రభుత్వపరంగా ఇచ్చే ఇళ్లకు నిర్ణీత సమయం తర్వాత అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పలువురు నాయకులతో పాటు పార్టీల కార్యాలయాలకు అద్దెలు చెల్లించడంలో అలసత్వం కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీతో పాటు… దాని అధినేత్రి సోనియా గాంధీ కూడా దీనికి మినహాయింపు కాదని తేలిపోయింది. సోనియా గాంధీ తన అధికారిక నివాసానికి అద్దె చెల్లించలేదు. జన్‌పథ్ రోడ్డులోని నివాసముంటున్న ఆమె… 4 వేల 610 రూపాయల అద్దె బకాయి ఉన్నారు. అయితే, 2020 సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో అద్దె కట్టారు. ఆ తర్వాత అద్దె చెల్లించలేదు. అలాగే సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్ ఉంటున్న ఇంటికి కూడా 2013 తర్వాత అద్దె చెల్లించలేదు. చాణక్యపురిలో గల ఆ బంగ్లాకు 5 లక్షల 8 వేల రూపాయల అద్దె బకాయి ఉంది.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
అక్బర్ రోడ్డులో గల కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పదేళ్ళుగా అద్దె చెల్లించడం లేదు. 2012 తర్వాత అద్దె చెల్లించలేదట. దీంతో 12 లక్షల 70 వేల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. నిబంధనల ప్రకారం జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలకు మూడేళ్ల పాటు వసతి సౌకర్యం ఉంటుంది. తర్వాత ఆ పార్టీలు ప్రభుత్వ భవనాలు ఖాళీ చేసి, సొంతంగా కార్యాలయాల్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది.
2010 జూన్‌లోనే ఢిల్లీ రౌజ్ ఎవెన్యూలో కాంగ్రెస్ పార్టీకి భూమి కేటాయింపు జరిగింది. కానీ భవన నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. 2013లోనే అక్బర్ రోడ్డులోని కార్యాలయంతో పాటు, మరో రెండు భవనాలను కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయాల్సి ఉంది. కానీ, పొడిగింపు వెసులుబాటును పలుమార్లు ఉపయోగించుకుంది ఆ పార్టీ. అలాగే 2020లో లోధి రోడ్డులోని బంగ్లాను నెల రోజుల్లో ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి నోటీసులు పంపారు అధికారులు.
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!