నితీశ్ కుమార్‌కు మహిళల అండ.. అందుకే ఫలితాల్లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు బీహార్ మహిళలంతా అండగా నిలుస్తున్నారు. జేడీయూను గెలిపించి ఎలాగైనా నితీశ్‌ను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోపెట్టేందుకు నడుం బిగించినట్లు కనిపిస్తున్నారు. ఉదయం నుంచీ రసవత్తరంగా సాగుతున్న బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ కూటమి దూసుకెళుతోంది. నితీశ్ కుమార్ విధానాలను బీహార్‌లోని పురుష ఓటర్లు విభేదిస్తున్నా.. మహిళా ఓటర్లు మాత్రం ఆయనను ఆదరిస్తున్నారు. ఇదే విషయంపైనే ఇప్పుడు స్థానిక గ్రామాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఎన్‌డీఏ కూటమి భాగస్వాములైన బీజేపీ-జేడీయూల్లో బీజేపీయే ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో ఉండడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే ఎక్కవ సీట్లు వచ్చినా బీజేపీ నితీశ్‌నే మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తుందేమో వేచి చూడాలి. అయితే.. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ చేసిన కామెంట్స్ కొంత అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మోడీ ప్రభావమే మమ్మల్ని విజయతీరాలకు చేర్చిందని, ప్రభుత్వ ఏర్పాటుపై సాయంత్రం కల్లా నిర్ణయం తీసుకుంటామని, నాయకత్వంపై కూడా సాయంత్రం కల్లా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నితీశ్‌నే తదుపరి సీఎంగా ఎంపిక చేస్తామని ఆయన చెప్పినా.. నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటామంటూ ఆయన ప్రకటించడం బీజేపీ ఏదో కొత్త వ్యూహం రచిస్తోందని జేడీయూ నేతల్లో అనుమానాలు రేకెత్తినట్లు తెలుస్తోంది సొంతంగానే బీజేపీ 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం.. జేడియూ కేవలం 48 స్థానాల్లోనే ముందంజలో ఉండడంతో నితీశ్ కుమార్‌ను మళ్లీ సీఎం చేస్తారా లేదా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?