2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ‘ఆత్మ నిర్భర్ భారత్’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి… అన్ని రంగాలకూ సమన్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు. బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా వస్తువుల ధరల్లో తగ్గుదల, పెరుగుదల కనిపిస్తుంది. తాజా బడ్జెట్ నేపథ్యంలో ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏయే […]
నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశారు. నెలల రోజుల వ్యవధిలోనే ప్రజలపై వందల రూపాయల భారాన్ని మోపారు. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇక, సిలిండర్ బుక్ చేసుకున్న వ్యక్తి ఈ మొత్తం చెల్లిస్తే సబ్సిడీ సొమ్ము తిరిగి బ్యాంకు ఖాతాలో పడేది. కానీ, ప్రస్తుతం సబ్సిడీ నగదు కూడా జమ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. […]
కోవిడ్ 19 అన్ని రంగాలను కుదిపేసింది.. కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది.. దీంతో, దేశాన్ని మన్ని ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే పన్నులు తప్పవనే ప్రచారం సాగింది.. రాబడి పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 సెస్ విధించేందుకు సిద్ధమైందనే ఊహాగానాలు వినపడ్డాయి. కానీ, ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేస్తున్నాయి అధికార వర్గాలు.. కోవిడ్-19 సెస్ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, యూనియన్ బడ్జెట్‌కు ముందు కూడా ఇలాంటి […]
టాలెంటెడ్ హీరో మంచు విష్ణు తాజాగా చేస్తున్న చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని జాఫ్రె చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాట నవదీప్ కీలక పాత్రలో చేస్తున్నారు. […]
అక్టోబర్ నెలలోనే అమెరికాలో వాక్సిన్ తీసుకొస్తామని, డిసెంబర్ నాటికి దేశంలో 10 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గతంలో వాక్సిన్ డెవలప్ చేస్తున్న కంపెనీలపై ఒత్తిడి లేదని, ట్రయల్స్ పూర్తైన తరువాతే వాక్సిన్ ను రిలీజ్ చేస్తామని కంపెనీలు పేర్కొన్నాయి. అటు సిడిఎస్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే, ఇప్పుడు ఆయా కంపెనీలపై ట్రంప్ సర్కార్ ఒత్తిడి తీసుకొచ్చింది. రాజకీయంగా ఒత్తిడి పెరగడంతో అమెరికన్ కరోనా వాక్సిన్ డెవలప్మెంట్ కంపెనీ వాక్సిన్ పరిశోధనకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను రిలీజ్ […]
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 590 పెరిగి రూ. 43,850కి చేరింది. ఇక 10 […]
ఆఫ్రికా ప్రాంతం నుంచి మనిషి వివిధ ప్రాంతాలకు విస్తరించారు. సుమారు లక్షా 20 వేల సంవత్సరాల క్రితం హోమో సేపియన్స్ సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలో సంచరించిన విషయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ భారీ అడుగులు మనిషికి సంబంధించినవే అని అంటున్నారు. సౌదీ అరేబియాలోని నిపుడ్ ఎడారిలో ఈ అడుగులను గుర్తించారు. ఎడారి ప్రాంతంలో ఒంటెలను ఇతర జంతువులను వేటాడే క్రమంలో అటువైపు వచ్చి ఉంటారని పరిశోధకులు చెప్తున్నారు. అరేబియా ప్రాంతంలో గుర్తించిన నిజమైన పాదముద్రలు ఇవే అని పరిశోధకులు స్పష్టం […]
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అందరికీ సుపరిచితమే. తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇష్క్ విష్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన షాహిద్ తరువాత అనేక సినిమాలు చేసినప్పటికీ అవి ఆశించిన ఫలితాలను అందించలేదు. అయినా పట్టు విడవకుండా షాహిద్ తన ప్రతిభను కనబరిచారు. వైవిధ్యమైన కథలతో స్టార్ హోదాను సంపాదించుకున్నారు. తాజాగా షాహిద్ తెలుగు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌తో భారీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాను […]
లండన్: కమలా హ్యారిస్‌ను ఇండియన్ అని సంబోధించినందుకు మన్నించాలని బ్రిటీష్ పార్లమెంటరీ నేత జాన్ కిల్‌క్లూనీ కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హ్యారిస్‌ను అభినందించేందుకు కిల్‌క్లూనీ ట్విటర్ వేదికగా ఈ మధ్య ఓ ట్వీట్ చేశారు. అందులో కమలా హ్యారిస్‌ను ఇండియన్ అంటూ సంబోధించారు. అయితే ఈ ట్వీట్‌పై తీవ్ర దుమారమే రేగింది. బ్రిటీష్ పార్లమెంట్ స్పీకర్ కూడా దీనిని తప్పుబట్టారు. కిల్‌క్లూనీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సూచించారు. దీంతో కిల్‌క్లూనీ […]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 841 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసు అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 15 చివరి తేదీగా నిర్ణయించారు. దీనికి పదో తరగతి విద్యార్హత. ఏప్రిల్ 9..10 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి. […]