భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన వేద కృష్ణమూర్తి ఇంట్లో విషాదం నెలకొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా వేద సోదరి వత్సల శివకుమార్ మృతి చెందారు. గత నెల వేద సోదరికి కరోనా సోకగా.. ఈరోజు ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని వేద కృష్ణమూర్తి మాజీ కోచ్ ఇర్ఫాన్ సైత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలిపారు. రెండు వారాల క్రితమే వేద తల్లి కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక వేద కృష్ణమూర్తి భారత […]
ఎవరికి ఏం కావాలో దానిని అందించడమే సోనూసూద్ లక్ష్యంగా ఇప్పుడు మారిపోయింది. శుష్క వాగ్దానాలకు, రాజకీయ విమర్శలకు తావు ఇవ్వకుండా సోనూసూద్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాంతో ఇవాళ దేశ వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా సోనూ సూద్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. నిన్న బెంగళూరులోని ఓ హాస్పిటల్ కు కొద్ది గంటల వ్యవథిలోనే ఆక్సిజన్ ను సరఫరా చేసి దాదాపు పాతిక పైగా ప్రాణాలను కాపాడిన సోనూసూద్ బృందం ఇప్పుడు […]
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సమయాన్ని కరోనా బాధితులకు సహాయం చేయడానికి కేటాయించారు దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి కావలసిన అవసరాలను తీర్చడంతో పాటు వారు ఎక్కడ నుండి తమకు కావాల్సిన వాటిని తీసుకోవచ్చు అనేదాన్ని తమ సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా తెలియచేస్తున్నారు. ఇదిలా […]
ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతపురం ఆసుపత్రిలో కోవిడ్ మరణాలపై రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి… అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఆక్సిజన్ ఇచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ దూర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న బళ్లారి, తమిళనాడు నుంచి ఇచ్చేలా పరిశీలన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆక్సిజన్ స్వయం సమృద్ధికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వానికి ప్రశ్నలు వేసింది. కోవిడ్ కేర్ […]
ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసరప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల నుండి దక్షణ కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి రాగల 3 రోజులు (06,07,08వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు […]
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,16,367 శాంపిల్స్ పరీక్షించగా 22,204 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 85 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 11,128 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ […]
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.జగనన్న కాలనీలలో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అనంతరం మాట్లాడుతూ… జగనన్న కాలనీలలో జూన్ 1న పనులు ప్రారంభం. ఈనెల 25 నాటికి ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి. కర్ఫ్యూ సమయంలోనూ ఈ పనులేవీ ఆగకూడదు. మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు నిర్వహించండి. నీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉండాలి. […]
నేటి నుండి 10 రోజుల పాటు మధ్యాహ్నం రెండు గంటల నుండి యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలో స్వచ్చంద లాక్ డౌన్ పాటిస్తున్నారు.కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనారసింహ స్వామి కొలువైఉన్న యాదగిరిగుట్టలో లాక్‌డౌన్ విధించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇది ప్రారంభమవుతుంది. నేటి నుంచి పది రోజులపాటు అమల్లో ఉండనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రతి […]
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అనంతరం రైతులకు చెల్లింపులకు వీలుగా ముఖ్యమంత్రి 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు 24 గంటల్లో జమ చేయాలన్నదే ధ్యేయం. మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలి. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి. ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ కానీ […]
ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణ పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. అంబులెన్సులో కరోనా బాధితులకు ఆక్సిజన్ ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని నియమించారు. పూర్తిగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి అక్కడే మకాం వేయాలని అసిస్టెంట్ […]