సూర్యపేట జిల్లా కోదాడ మండలం రామాపురం ఎక్స్ రోడ్డు వద్దా తెలంగాణ- ఆంధ్రా అంతరాష్ట్ర సరిహద్దులో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. తెలంగాణలోకి రావాలంటే లాక్ డౌన్ మినహాయింపు సమయంలో కూడా ఈ-పాస్ ఉన్న వారినే పంపిస్తున్నారు పోలీసులు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ లకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పాసులు లేకపోవడంతో చాలా వాహనాలు నిలిపివేస్తున్నారు పోలీసులు. బైక్, ఆటోలతోసహ అన్ని వాహనాలను నిలిపివేయడంతో భారీగా నిలిచిపోయాయి వాహనాలు. అయితే నిన్నటి నుండి రాష్ట్రంలో ఆంక్షలు మరింత […]
కన్నతల్లి లాంటి తెరాస పార్టీని వీడేదిలేదని కమలాపూర్ మండలం జెడ్పిటిసి లాండిగ కళ్యాణి లక్ష్మణ్ రావు,మాజీ జెడ్పిటిసి మారపెళ్లి నవీన్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు మాట్ల రమేష్ తేల్చిచెప్పారు. ఈ రోజు ఉదయం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని హన్మకొండలోని వారి నివాసంలో కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో, పార్టీ సూచనల మేరకు పనిచేస్తామని కమలాపూర్ మండలంలో తెరాసను ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగుర్ల వెంకన్న, వరంగల్ అర్బన్ […]
ఆనందయ్య మందు పంపిణీ పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే గత రెండు రోజులుగా ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ప్రస్తుతం నెల్లూరు అధికారుల ఆధీనంలో ఉన్నారు ఆనందయ్య. ఇక నిన్న ఆయూష్ కమిషనర్ రాములు సమక్షంలో మందు తయారు చేసారు ఆనందయ్య. అయితే ఆ మందులో హానికర పదార్థాలు లేవని ఆయూష్ కమిషనర్ పేర్కొన్నారు. కానీ ఆనందయ్య తయారు చేస్తున్న మందుని ఆయుర్వేదంగా గుర్తించలేమన్న రాములు… ఆనందయ్య తయారు చేస్తుంది నాటు మందుగా […]
తెలంగాణలో పోలీసులు రాష్ట్రంలో కఠిన ఆంక్షలతో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అనవసరంగా ఎవరైనా రోడ్డు పైకి వస్తే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న ఫుడ్ డెలివరీ బాయ్స్ బైక్స్ ను కూడా సీజ్ చేసారు పోలీసులు. కానీ తమకు ఎటువంటి సూచనలు లేకుండా పోలీసులు ఇలా చేస్తున్నారు అని డెలివరీ బాయ్స్ అందాలని చేసారు. అయితే తాజాగా ఫుడ్ డెలివరీ సేవలకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దు అని తెలంగాణ డిజిపి తెలిపారు. […]
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం… రేపటికి తుఫాన్ గా మారనుంది. అయితే ఈ తుఫాన్ కు యాస్ గా నామకరణం చేసారు. ఈ “యాస్”తీవ్ర తుఫాన్ గా బలపడి ఈనెల 26న ఒడిషా,బెంగాల్ తీరాన్ని తాకుతుందని అంచనా వేశారు అధికారులు. బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తుఫాన్ కారణంగా ఐదు రోజులు మత్య్సకారుల వేటపై నిషేధం విధించారు. బంగాళాఖాతంలో తుఫాను […]
తిరుమల శ్రీవారిని నిన్న 5788 మంది భక్తులు దర్శించుకున్నారు. 2258 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండి ఆదాయం 24 లక్షలుగా ఉంది. అయితే ఇవాళ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పునరుద్ధరణ జరుగుతుంది. అలాగే జూన్ నెలకుకు సంభందించి ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును విడుదల చేసింది టీటీడీ. కానీ కోవిడ్ కారణంగా దర్శనాలు సంఖ్యని 5 వేలకు తగ్గించింది టీటీడీ. అయితే ఏపీలో కరోనా కేసులు […]
హైదరాబాద్‌కు చెందిన దీప్తీ నార్కుటి అనే విద్యార్థి అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో ఏడాదికి 2 కోట్ల ప్యాకేజీ కొట్టేసింది. దీప్తీ సీటెల్‌లోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో గ్రేడ్ -2 లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా పని చేయనుంది. దీప్తీ ఇటీవల ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో తన ఎంఎస్ పూర్తి చేసింది. కాలేజీ ప్లేస్‌మెంట్ సమయంలో, ఆమెకు గోల్డ్‌మన్ సాచ్స్ మరియు అమెజాన్ నుండి ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ మైక్రోసాఫ్ట్ నుండి జాబ్ ఆఫర్ అందుకున్న […]
కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే, నిన్న ఇవాళ మాత్రం బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో… బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,000 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర […]
మేషం : మీ రాశి స్వామి అంగారకుడు పాపగ్రహాల సాంగత్యంతో ఉండటం వల్ల మీకు ఈ రోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. సంతానం వైపు నుంచి నిరాశ పరిచే వార్తలను వింటారు. సాయంత్రం ఆగిపోయిన పనులు, వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. రాత్రి సమయంలో మీకిష్టమైన వారిని కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఫలితంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వృషభం : ఈ రోజు వృషభ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. అంతేకాకుండా మానసిక […]
ఈరోజు నుండి లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సడలింపు సమయంలోనే ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. డెలివరీ బాయ్స్ టీషర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు. అలా చేసే వారి పై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతి ఉంది. అనవసరంగా బయటికి వస్తే వాహనాలను సీజ్ చేసి లాక్ డౌన్ తర్వాత కోర్టు […]