హైదరాబాద్‌కు చెందిన దీప్తీ నార్కుటి అనే విద్యార్థి అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో ఏడాదికి 2 కోట్ల ప్యాకేజీ కొట్టేసింది. దీప్తీ సీటెల్‌లోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో గ్రేడ్ -2 లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా పని చేయనుంది. దీప్తీ ఇటీవల ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో తన ఎంఎస్ పూర్తి చేసింది. కాలేజీ ప్లేస్‌మెంట్ సమయంలో, ఆమెకు గోల్డ్‌మన్ సాచ్స్ మరియు అమెజాన్ నుండి ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ మైక్రోసాఫ్ట్ నుండి జాబ్ ఆఫర్ అందుకున్న మొత్తం 300 మందిలో దీప్తీకే అత్యధిక ప్యాకేజీ లభించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దీప్తీ తండ్రి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఫోరెన్సిక్ లో పని చేస్తున్నారు.