సూర్యపేట జిల్లా కోదాడ మండలం రామాపురం ఎక్స్ రోడ్డు వద్దా తెలంగాణ- ఆంధ్రా అంతరాష్ట్ర సరిహద్దులో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. తెలంగాణలోకి రావాలంటే లాక్ డౌన్ మినహాయింపు సమయంలో కూడా ఈ-పాస్ ఉన్న వారినే పంపిస్తున్నారు పోలీసులు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ లకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పాసులు లేకపోవడంతో చాలా వాహనాలు నిలిపివేస్తున్నారు పోలీసులు. బైక్, ఆటోలతోసహ అన్ని వాహనాలను నిలిపివేయడంతో భారీగా నిలిచిపోయాయి వాహనాలు. అయితే నిన్నటి నుండి రాష్ట్రంలో ఆంక్షలు మరింత కఠినతరం చేసిన పోలీసులు అనవసరంగా రోడ్లపైకి వస్తే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.