హైదరాబాద్ లో గచ్చిబౌలి లోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ ని సందర్శించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జులై 23 – 2021 నుండి ఆగస్టు 8 – 2021 వరకు జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలంపిక్స్ కు సన్నద్ధమవుతున్నా బ్యాడ్మింటన్ క్రీడాకారులను కోచ్ గోపిచంద్తో కలసి మంత్రి ప్రోత్సహించారు. లాక్ డౌన్ సమయంలో క్రీడాకారులు బయటికి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మంత్రి. కోవిడ్ నిర్ములన లో భాగంగా క్రీడాకారులు తమ ఫిట్ నెస్ ను ఇంటిలోనే, చుట్టుపక్కల పరిసరాల్లో తమ ఫిట్ నెస్ ను కాపాడుకోవాలని సూచించారు. ఇక క్రీడాకారులకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS) అధికారులను మంత్రి ఆదేశించారు. అందుకు క్రీడాకారుల జాబితాను వెంటనే సిద్ధం చేసి, హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో వాక్సినేషన్ కార్యక్రమంను నిర్వహించాలని SATS అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు.