ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమే.. కానీ ఇప్పటి వరకు ఈటల నన్ను కలవలేదు అని తెలిపారు. ఆయన నేను కలిసి 15 ఏళ్ళు కలిసి పనిచేసాం… ఇప్పుడు కలిస్తే తప్పేంటి అని అన్నారు. మేము కలిసినంత మాత్రానా పార్టీ లో చేరేందుకు అనుకోలేము. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. అందరినీ కలుస్తున్నా మిమ్మల్ని కూడా కలుస్తా అని నాతో చెప్పాడు ఈటల. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక వస్తే పోటీ లో ఉండాలా వద్ద అనేది చర్చించలేదు. ఈ విషయం పై పార్టీ లో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటాం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.