రాష్ట్రంలో 7 వేల పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. నిన్న సాయంత్రం వరకే 77 శాతం ధాన్యం కొనుగోలు చేశాం అని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 90 లక్షల మంది రైతుల వద్ద…11వేల 500 కోట్ల విలువైన 61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేశాం. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేటలో ధాన్యం లేక కొనుగోలు కేంద్రాలు మూసివేశాము అన్నారు. ఒకటి రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు జమ చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రంలో ప్రతీ గింజా కొనుగోలు చేస్తాం. కోటి ముప్ఫై లక్షల టన్నుల ధాన్యం వస్తోందని అంచనా. ధాన్యం రవాణా కోసం ట్రాన్స్ పోర్టు టెండర్లు పిలిచాం. ఇప్పుడు రాని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం అన్నారు. రేషన్ డీలర్లు, ఎల్పీజీ సిబ్బంది, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ సిబ్బందిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వ్యాక్సిన్ అందజేస్తాం అని తెలిపారు.