పెట్రోల్,డిజిల్ ధరల పెంపును నిరసిస్తూ వరంగల్ నగరంలో కాంగ్రెస్ నేతల ధర్నా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెట్రోల్,డిజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో చేసిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సందర్బంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… ప్రభుత్వం 35 రూపాయలు పెట్రోల్ కి 65 రూపాయల టాక్స్ వసూలు చేస్తుంది అన్నారు. సాధారణ ప్రజల దగ్గర ఇంత దోచుకుంటూ పెద్ద పెద్ద ప్రైవేట్ వ్యాపారులు చెల్లించనీ లోన్లు […]
జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఏఐసిసి పిలుపుమేరకు పెట్రోల్, డీజిల్ గ్యాస్ పెరుగుదలకు నిరసనగా ఎమ్మెల్సీ జీవం రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ చౌరాస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై నిరసన తెలిపుతున్న తరుణంలో వారిని అరెస్ట్ చేసే క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొద్ధిసేపు […]
ఏఐసీసీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గించాలని ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాల కారణంగా దేశ వ్యాప్తంగా 100 కు చేరింది పెట్రోల్ ధర. ఏడాది నుండి 25 రూపాయలు పెరిగింది. దీనికి కారణం మోడీ ప్రభుత్వమే. సుమారు 43 సార్లు ధరలను పెంచింది. యూపీఏ ప్రభుత్వం లో 52000 కోట్లు మాత్రమే ఉంది. 2014 లో 72 వేల కోట్లు ఎన్డీయే […]
కాకినాడ సాయిసుధా హాస్పిటల్ అధినేత, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ వాడ్రేవు రవిపై క్రిమినల్ కేసు నమోదు చేసారు. కొవిడ్ కేసుకు అత్యధికంగా 14 లక్షల రూపాయలు ఫీజు వసూలు, వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం, మృతుడు కుటుంబ సభ్యులను మోసగించారనే అభియోగాలపై బాధితులు ఫిర్యాదు చేసారు. క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాకినాడ త్రీటౌన్ పోలీసులు. డాక్టర్ వాడ్రేవు రవిని పోలీసు స్టేషన్ లో విచారించారు త్రీటౌన్ సి.ఐ. రామకోటేశ్వరరావు. ఇక సాయిసుధా హాస్పిటల్ […]
కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువులు, ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైయస్.జగన్ భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాము సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి కేంద్ర మంత్రికి వివరించిన సీఎం… కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్‌విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారంలేకుండా చూడాలన్నారు సీఎం. అయితే ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రి […]
భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. ఈ దేశంలోని పౌరులందరినీ ఒక్కటిగా కలిపి ఉంచాలని మహనీయులు కలలు కని రూపొందించిన రాజ్యాంగం మనది. కానీ ఏడు దశాబ్దాలు గడిచినా ఈ దేశంలో కులాల మధ్య చిచ్చు రావణకాష్టంలా రగులుతూనే ఉంది. దీనికి కారణం ఏమిటి? రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయని రాజకీయ నాయకులదా? కులోన్మాదాన్ని పెంచి పోషిస్తూ పబ్బం గడుపుకుంటున్న కుల సంఘాల నేతలదా? అటు అధికారపీఠంపై ఉన్న నేతలలోనూ, ఇటు కులోన్మాదులలోనూ […]
పోలవరం ప్రాజెక్టులో నేడు ఓ మైలురాయిగా మిగిలిపోనుంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే నుంచి నేడు దిగువకు గోదావరి నీటి విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి అయ్యింది. స్పిల్ వే మీదుగా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. కాఫర్ డ్యాం బ్యాక్ వాటర్ తో ముంపు గ్రామాలకు వరద భయం ఉంది. దాంతో ముంపు గ్రామాల నిర్వాసితులు గ్రామాలు ఖాళీచేస్తున్నారు. ఈరోజు అప్రోచ్ […]
విశాఖలో పోలీసుల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించిన గంజాయి స్మగ్లర్లు వేగంగా నడుపుతూ చెక్ పోస్ట్ గేటును బైక్ తో కొట్టారు. ఈ ఘటనలో గంజాయి బ్యాగుతో పాటు కిందపడ్డ వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో అతడిని ఎస్.కోట ఆసుపత్రికి తరలించారు. బైక్ డ్రైవింగ్ చేస్తున్న దుండగుడు తప్పించుకున్నాడు. విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటి చేసుకుంది. దీనికి సంబంధించిన ప్రమాద దృశ్యం సీసీటీవీ లో […]
హెచ్ పీసీఎల్ రిఫైనరీలో అగ్ని ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం అని కలెక్టర్ కు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది టెక్నీకల్ కమిటీ. ప్రమాదానికి కారణాలు తెలిపింది. బిటుమిన్ ను తీసుకు వెళ్తున్న 6 ఇంచ్ ల పైపులైను కు 2.5 అంగుళాల నుండి 3 అంగుళాల రంధ్రము ఏర్పడింది. 355 నుండి 400 ఉష్ణోగ్రతల బిటుమిన్ లీకవ్వడంతో మంటలు చెలరేగాయి. 30 మీటర్ల ఎత్తులో ఉన్న పైపు లైన్లు 6 చోట్ల దెబ్బతిన్నాయి. బిటుమిన్ కు హైడ్రోకార్బన్లు […]
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 91,702 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,74,823 కి చేరింది. ఇందులో 2,77,90,073 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,21,671 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 3,403 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,63,079 కి చేరింది. ఇక ఇదిలా […]