ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వేషాల కారణంగా గోదావరిలో వరద ప్రభావం పెరుగుతుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అప్పర్ డ్యామ్ నిర్మాణం కావడంతో బ్యాక్ వాటర్ లో నీటి మట్టం పెరిగి ముంపు ప్రాంతాల ప్రజలు భయం పట్టుకుంది. గత ఏడాది వరదలను దృష్టిలో పెట్టుకొని పోలవరం ముంపు ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. వరదలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తునం అంటున్నారు చీఫ్ ఇంజనీర్ సుధాకర్.
ఇంగ్లాండ్ లో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడినట్లు సమాచారం. ప్రాక్టీస్ లో భారత పేసర్ మొహ్మద్ షమీ విసిరిన బౌన్సర్‌కు కోహ్లీకి గాయం అయినట్లు తెలుస్తుంది. కోహ్లీ పక్కటెముకలకు గాయం అయినట్లు.. దాంతో అతను మూడు నుంచి ఆరు వారాలు ఆటకు దూరం కావాల్సి వస్తుందని సమాచారం. కానీ దీని పై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. […]
ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్న… కరోనా మంతనాలు మాత్రం తగ్గడం లేదు. దేశంలో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,59,155 కి చేరింది. ఇందులో 2,79,11,384 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,80,690 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,002 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,67,081 […]
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా, భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. అయితే బీసీసీఐ తనను టీమిండియా కెప్టెన్‌గా నియమించడం పై సోషల్ మీడియా వేదికగా శిఖర్ ధావన్ స్పందించాడు. తన ట్విట్టర్ లో “దేశానికి నాయకత్వం వహించడం గొప్పగా భావిస్తున్నా. మీ అందరి విషెస్‌కు ధన్యవాదాలు” అని ధావన్ ట్వీట్ చేశాడు. అయితే ధావన్ మొదటి సారి జట్టును నడిపించబోతున్నాడు. […]
మేషం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకేస్తారు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలలో లాభసాటిగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. వృషభం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు […]
జూరాల ప్రాజెక్టు కు వరద కొనసాగుతుంది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కారణంగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 13,200 క్యూసెకులు ఉండగా… ఔట్ ఫ్లో 20,075 గా ఉంది. ఇక నారాయణపూర్ పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుతం 318.140 అడుగులుగా ఉంది. అలాగే పూర్తిస్దాయి నీటి నిల్వ 9.657 టిఎంసీలు కాగా ప్రస్తుతం 8.888 టీఎంసీలు ఉంది. అయితే విద్యుత్ […]
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 46,100 కి […]
నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఐదో రోజు సీబీఐ విచారణ జరుపుతుంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహాంలో విచారణ చేస్తుంది సీబీఐ అధికారుల బృందం. ఇక నిన్న వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి,,కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను 8 గంటల పాటు ప్రశ్నించారు. నేడు విచారణకు వివేకా కుమార్తె సునీత వచ్చే అవకాశం ఉంది. ఇక పులివెందులలో వైయస్ వివేకా ఇంటిని పరిశీలిస్తున్నారు సీబీఐ అధికారులు. వైఎస్ వివేకా ఇంటితో పాటు […]
కోవిడ్, ధాన్యం కొనుగోళ్లు రెండింటిలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యింది అని వైఎస్ షర్మిల తెలిపారు. ధాన్యం పండించిన రైతులు ఇబ్బందులు పడుతుంటే .. కేసీఆర్ పట్టించుకోవడం లేదు. మొండి నమ్మకంతో గుండె నిబ్బరంతో సాగు చేస్తున్న రైతులు గుండెలు బాదుకునేలా అరుస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. చివరి గింజ వరకు కొంటానని చెప్పిన తర్వాతే కదా రైతులు సాగు చేసింది. బట్టలు మార్చుకునేంత ఈజిగా మాట మారుస్తారా అని ప్రశ్నించిన షర్మిల 80 వేల పుస్తకాలు […]
అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుపుతుంది. అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన ప్రతిపాదనకు తీవ్రంగా స్పందించారు జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ బెంచ్. అగ్రిగోల్డ్ కంపెనీ ప్రతిపాదనకు అంగీకరిస్తే మరో ఇరవై ఏళ్లు హైకోర్టు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్న హైకోర్టు… అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన సవరించిన ప్రతిపాదనలపై సమాధానం ఇవ్వాలని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు ఎక్కువగా […]