ఏఐసీసీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గించాలని ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాల కారణంగా దేశ వ్యాప్తంగా 100 కు చేరింది పెట్రోల్ ధర. ఏడాది నుండి 25 రూపాయలు పెరిగింది. దీనికి కారణం మోడీ ప్రభుత్వమే. సుమారు 43 సార్లు ధరలను పెంచింది. యూపీఏ ప్రభుత్వం లో 52000 కోట్లు మాత్రమే ఉంది. 2014 లో 72 వేల కోట్లు ఎన్డీయే లో పెంచింది. 11 లక్షల కోట్లు 2014 నుండి 2018 వరకు పెరిగింది. అంతర్జీతీయ చమురు ధరలు తగ్గుతుంటే ఇక్కడ excise సుంకం భారీగా పెరిగింది అని తెలిపారు. Excise డ్యూటీ భారీగా పెంచుతూ పేదల నడ్డి విరుస్తుంది కేంద్రం. 2013 లో 31 శాతం ఉండేది రాష్ట్ర పన్ను.. ఈ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై కాంగ్రెస్ ఆందోళన చేస్తున్నాం. వెంటనే వీటిని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.