వైఎస్సార్ బీమా పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా వైయస్సార్ బీమాలో మార్పులు చేసారు. క్లెయిముల పరిష్కారంలో చిక్కులకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించనుంది. కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి అయి ఉండి 18 నుంచి 50ఏళ్ల మధ్య వయస్సు వారు సహజంగా మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 1లక్ష ఆర్థిక సహాయం… ఒకవేళ సంపాదించే […]
కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీహెచ్ శ్రీనివాస రావు. మే 29 నుంచి రోజుకు సరాసరి లక్ష పరీక్షలు జరుగుతున్నాయి అని తెలిపిన డీహెచ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 66,79,098 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ పేషంట్లు తగ్గుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36.50 శాతం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 16.35 శాతం పడకలు నిండాయి. మూడో దశ ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10,366 ఆక్సిజన్ పడకలుగా మార్చాం.మిగతా 15వేల పడకలకు ఆక్సిజన్ […]
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లోనే ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుల్ పై దాడి చేసారు. ఓ కేసులో ఇద్దరు నిందితులను విచారణ కై పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చిన పోలీసులు… విచారిస్తున్న సమయంలో ఒక్కసారిగా కానిస్టేబుల్ కిరణ్ పై దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ కానిస్టేబుల్ కిరణ్ ను వెంటనే వైద్యం నిమిత్తం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. గాయపడ్డ కానిస్టేబుల్ తలపై ఆరు కుట్లు పడటంతో ప్రస్తుతం అక్కడే వైద్యం తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై […]
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. తాజా మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ… మన పార్టీలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తాం. కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులు. కార్యకర్తలు చెప్పిందే సిద్ధాంతం. అదే పార్టీ రాజ్యాంగం అని పేర్కొన్నారు. తెలంగాణలో వైఎస్ తో లబ్ది పొందని ఇల్లే లేదు అన్నారు. వైఎస్ సంక్షేమ పాలనను గుర్తు తెచ్చేలా… తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టేలా… పార్టీ ఎలా ఉండాలో కార్యకర్తలే చెప్పాలి. ప్రజలందరి భాగస్వామ్యం మనకు […]
నిన్న తిరుమల శ్రీవారిని 11302 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 3710 మంది భక్తులు సమర్పించగా… హుండి ఆదాయం 87 లక్షలు ఉంది. ఇక హనుమంతుడి జన్మస్థలం అయిన ఆకాశగంగలో ఇక పై నిత్య పూజలు, నివేదన సమర్పించేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. అయితే ఈ నెల 19వ తేదిన టిటిడి పాలకమండలి సమావేశం జరగనుండగా… 21వ తేదిన పాలకమండలి గడువు ముగియనుంది. ఇక శ్రీవారి మెట్టు నడకమార్గంలో ఆలయం వద్ద శంఖు, చక్రాలు విగ్రహల తొలగించిన […]
నేడు ఏపీ జూనియర్ డాక్టర్లు ఆందోళన జరుగుతుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చటం లేదంటున్న జూడాలు.. రుయా ఆసుపత్రిలో తొలుత నాన్ కొవిడ్, తర్వాత కొవిడ్ విధులను బహిష్కరించనున్నారు. కొవిడ్ ఇన్సెంటివ్లు, ఉపకార వేతనాల నుంచి కోతలు, రోగుల కుటుంబ సభ్యుల నుంచి జూడాలకు భద్రత తదితర విషయాల్లో ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే రెండు రోజుల కిందటే జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈరోజు […]
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద మొదలయ్యింది. ప్రస్తుతం జూరాలకు 27,400 క్యూసెక్కుల వరద వస్తుంది. ఈ సీజన్ లో ప్రాజెక్టుకు ఇదే అత్యధిక ఇన్ ఫ్లో. అలాగే ఇప్పటివరకు జూన్ మొదటి వారంలో ఈ స్థాయిలో వరద రావడం ఇదే ఫస్ట్ టైం.జూరాల క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో వరద కొనసాగుతుంది. అలాగే కృష్ణా నదిపై ఎగువనున్న ప్రాజెక్టులకు వరద భారీగా వస్తుంది. ఎగువన ఆల్మట్టి డ్యామ్ కు 16,300 క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టుకు 8 […]
ఈటల.. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లడతా అని బీజేపీలో చేరడం ఎంటో అర్దం కావడం లేదు అని జీవన్ రెడ్డి అన్నారు. తెరాస అవినీతికి రక్షణగా నిలిచింది బీజేపీ. ఈటల బీజేపీలో కలుస్తారని నేను ఊహించలేదు. ఆయన బలహీనత బయట పడింది. ఈటల బీజేపీలో చేరుతూ తన వ్యక్తిత్వం కోల్పోయారు. ఇక కాంగ్రెస్ నీ ఎవడో నడపడు. కాంగ్రెస్ నీ నడిపిస్తుంది రాహుల్ గాంధీ. ఈటల స్థాయిని స్వయంగా ఆయనే తగ్గించుకున్నారు. నియోజక వర్గానికి పరిమితం అయ్యాడు. […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు చర్చాంశనీయంగా మారింది. అయితే మొదట ఈ ముందుకు బ్రేక్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిన్నటి నుండి మందు పంపిణి ప్రారంభించారు. అయితే తాజాగా కడపలో ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీకి బ్రేక్ పడింది. వనమూలికలు, తేనే, ముడి సరుకు నిర్వాహకులు సిద్దం చేసుకున్నారు. అయిన ఆనందయ్య శిష్యులు నేడు రాకపోవడంతో మందుల తయారీ, పంపిణీ వాయిదా వేసినట్లు […]
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షకు హాజరు అయ్యారు సంగా రెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రోడ్ల పైకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఆందోళనలు, ధర్నాలు ఉండవని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఏమి చేస్తుంది. ధాన్యం తరలింపు సక్రమంగా లేదు.. తీవ్ర ఇబ్బందులున్నాయి. ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప అక్కడ ఎలాంటి […]