Almond Protest: బాదం తిని ఫైల్ గుర్తు చేసుకోండి.. ఫైల్ మరచిపోయిన అధికారికి బాదంతో యువకుడి నిరసన
- బాదం తిని ఫైల్ గుర్తు చేసుకోండి
- ఫైల్ మరచిపోయిన అధికారికి బాదంతో యువకుడి నిరసన
- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్లోని హౌసింగ్ బోర్డ్ కార్యాలయంలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పౌరులకు సేవలందించాల్సిన ప్రభుత్వ అధికారులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. వివిద అసరాల నిమిత్తం ఆఫీసులకు వచ్చే ప్రజలను చెప్పులు అరిగేలా తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు కొందరు అధికారులు. ఇదేవిధంగా ఓ ప్రభుత్వ అధికారిని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ యువకుడు వినూత్న నిరసనకు తెరలేపాడు. బాదం ను అధికారిని టేబుల్ పై విసిరి నిరసన తెలిపాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్లోని హౌసింగ్ బోర్డ్ కార్యాలయంలో జరిగింది.
Also Read:AP Weather Alert: ఏపీలో డబుల్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎండలు..
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ఒక సంవత్సరం కాలంగా తన ప్రాపర్టీ మ్యుటేషన్ ఫైల్ కనిపించకపోవడంతో ఆగ్రహం చెందిన యువకుడు, సబ్-రిజిస్ట్రార్ అధికారి డెస్క్ మీద 500 గ్రాముల బాదం చల్లి, “ఇవి తిని మీ మెమరీ మెరుగుపరచుకోండి, నా ఫైల్ ఎక్కడ ఉందో గుర్తు చేసుకోండి” అని అధికారిణిపై ఫైర్ అయ్యాడు. యువకుడి పేరు తరుణ్ సాహు. ఒక సంవత్సరం క్రితం తన ఆస్తి సంబంధిత ఫైల్‌ను సబ్-రిజిస్ట్రార్ (డెప్యూటీ రిజిస్ట్రార్) కార్యాలయంలో సమర్పించాడు. కానీ ఫైల్ కనిపించడం లేదని, అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాడు. తన ఆవేదనను వ్యక్తం చేయడానికి తరుణ్ ప్రత్యేక మార్గం ఎంచుకున్నాడు. బాదం మెదడు శక్తిని, మెమరీని మెరుగుపరుస్తుందని ప్రజలు నమ్మడం ఆధారంగా, 500 గ్రాముల బాదం ప్యాకెట్ తీసుకెళ్లి అధికారి (పూనం బంజారే) డెస్క్ మీద చల్లాడు.
Also Read:CSK Vs SRH: టాస్ గెలిచిన సీఎస్కే.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. ఇరు జట్లలోకి కొత్త ప్లేయర్లు..
“మేడమ్, ఈ బాదం తిని మీ మెమరీ షార్ప్ చేసుకోండి. నా ఫైల్ ఎక్కడ ఉందో గుర్తు చేసుకుని నాకు తెలియజేయండి” అని అన్నాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఈ నిరసనను “స్మార్ట్ & హ్యూమరస్ ప్రొటెస్ట్”గా ప్రశంసిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ కార్యాలయాల్లోని నిర్లక్ష్యం, ఫైల్‌లు కోల్పోవడం వంటి సమస్యలను ఎత్తి చూపుతున్నారు. ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలను మళ్లీ ఒకసారి చర్చనీయాంశం చేసింది.
"Have almond! This will help revive your memory about my lost file"
In Chattisgarh's Bilaspur, a man emptied a packet of almond on the table of an official of the housing board to help revive her "memory loss" related to his pending file. He has been running pillar to post to… pic.twitter.com/m00mODPC6A
— Piyush Rai (@Benarasiyaa) April 18, 2026
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!