Mi-17 V5 హెలికాఫ్టర్ ప్రత్యేకతలు ఇవే..!
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- ప్రపంచలోని బెస్ట్ ఆర్మ్డ్ హెలికాఫ్టర్లలో Mi-17 V5 ఒకటి.
- ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత అధునాతన హెలికాప్టర్‌లలో ఒకటి..
- ఈ ఛాపర్ యొక్క భద్రతా రికార్డు ప్రపంచంలోని కొన్ని ఇతర కార్గో ఛాపర్‌ల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ప్రమాదాలు తక్కువగా నమోదవుతూ ఉంటాయి..
- Mi-17V5 అనేది Mi-8/17 హెలికాప్టర్ల శ్రేణికి చెందినది..
- మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ కోసం దీన్ని స్పెషల్ గా డిజైన్ చేశారు..
- ప్రపంచవ్యాప్తంగా అనేక అగ్రదేశాల ఆర్మీలో ఈ రకం హెలికాఫ్టర్‌లను ఉపయోగిస్తున్నారు..
- రష్యాకు చెందిన కజాన్ హెలికాప్టర్స్ సంస్థ వీటిని తయారు చేస్తుంది..
- ఈ హెలికాప్టర్‌ను సైన్యం.. ఆయుధాల రవాణా, అగ్నిమాపక మద్దతు, కాన్వాయ్ ఎస్కార్ట్, పెట్రోలింగ్ , సెర్చ్ అండ్ రెస్క్యూ వంటి వాటి కోసం ఉపయోగిస్తారు..
- ఇండియన్ ఆర్మీలో ఈ హెలికాఫ్టర్లు 80 ఉన్నాయి..
- Mi-17V5 హెలికాఫ్టర్‌లో క్లిమోవ్ TV3-117VM లేదా VK-2500 టర్బో-షాఫ్ట్ ఇంజన్లు ఉంటాయి..
- 2,100 నుంచి 2,700 హెచ్‌పీ పవర్ అవుట్‌పుట్‌ను ఈ టర్బో షాఫ్ట్ ఇంజిన్లు ఉత్పత్తి చేస్తాయి..
- ఈ హెలికాప్టర్ పూర్తి డిజిటల్ కంట్రోల్ సిస్టం తో ఉంటుంది..
- గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఈ హెలికాప్టర్ ప్రయాణిస్తుంది..
- అత్యధిక ఇంధన సామర్థ్యం ఉన్న ఈ హెలికాప్టర్ లో ఒక్క సారి ఫ్యూయల్ నింపితే ఐదు వందలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించవచ్చు..
- ఈ హెలికాప్టర్ లో రెండు పెట్రోల్ ట్యాంకులు ఉంటాయి…
- రెండు పెట్రోల్ ట్యాంక్ లోని ఫ్యూయల్ తో వెయ్యి కిలోమీటర్ల వరకూ ఈ హెలికాఫ్టర్‌తో నిరంతరం గా ప్రయాణించవచ్చు..
- ఈ హెలికాప్టర్ గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది.
- Mi-17 రవాణా హెలికాప్టర్ ప్రయాణీకుల కోసం ప్రామాణిక పోర్ట్‌సైడ్ డోర్‌తో కూడిన పెద్ద క్యాబిన్‌ను ఉంటుంది.
- ఆర్మ్డ్ ఫోర్సెస్, కార్గో ట్రాన్స్పోర్ట్ కోసం హెలికాప్టర్ వెనుకవైపు రాంప్ ఉంటుంది.
- ఈ హెలికాప్టర్ గరిష్టంగా టేకాఫ్ బరువు 13,000 కిలోలు..
- 36 మంది పట్టె సామర్థ్యం కలిగి 4,500 కిలోల బరువును మోయగలదు..
- క్లిష్ట పరిస్థితులలో కూడా సమర్థంగా పని చేస్తుంది..
- యుద్ధ సమయంలో శత్రుదుర్బేద్యంగా పని చేస్తుంది..
- Mi-17V5 నాలుగు మల్టీఫంక్షన్ డిస్‌ప్లేలు , నైట్-విజన్ వేపన్స్, ఆన్-బోర్డ్ వెదర్ రాడార్ ఆటోపైలట్ సిస్టమ్‌తో సహా అత్యాధునిక ఏవియానిక్స్‌తో కూడిన గ్లాస్ కాక్‌పిట్ లతో కూడిన వ్యవస్థ ఉండటం ఈ హెలికాఫ్టర్ ప్రత్యేకత..
- ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం Mi-17 V5 హెలికాప్టర్లను.. నావిగేషన్,ఇన్ఫర్మేషన్-డిస్ప్లేస్, క్యూయింగ్ సిస్టమ్‌లతో వీటిని రూపొందించారు..
- దీన్ని యుద్ద సమయంలో వేపన్స్, ఫోర్సెస్ ను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు..
- Shturm-V మిసైల్స్, S-8 రాకెట్లు, 23mm మెషిన్ గన్, PKT మెషిన్ గన్‌లు, AKM సబ్-మెషిన్ గన్‌లను ఈ హెలికాప్టర్‌తో తో లోడ్ చేయవచ్చు.. టార్గెట్ ని ఫినిష్ చెయ్యవచ్చు..
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!