భారత జట్టు తాజాగా న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ ల సిరీస్ లో తలపడిన విషయం తెలిసిందే. అయితే ఇందులో మొదటి టెస్ట్ ను డ్రా గా ముగించుకున్న టీం ఇండియా రెండో టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. అయితే ఇందులో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ 5వ స్థానంలో అలాగే కోహ్లీ 6వ స్థానంలో అలాగే కొనసాగుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ, అర్ధ సెంచరీతో చెలరేగిన మయాంక్ 31 స్థానాలను మెరుగుపరుచుకొని కెరియర్ బెస్ట్ గా 11 వ స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్ లో అశ్విన్ రెండో స్థానంలోనే ఉండగా… ఈ సిరీస్ లో పాల్గొనని బుమ్రా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు.
అయితే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో జడేజా స్థానాన్ని అశ్విన్ ఆక్రమించాడు. ఈ సిరీస్ లో బాల్ తో… బ్యాట్ తో రాణించిన అశ్విన్ ఆల్ రౌండర్ గా 2వ స్థానానికి వచ్చేసాడు. అక్కడ ఉన్న జడేజా రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆడలేదు కాబట్టి 4వ స్థానానికి పడిపోయాడు. మధ్యలో మూడో స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఉన్నాడు.