ప్రతిపక్ష టీడీపీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు సద్విమర్శలు చేయడం అలవాటు చేసుకోవాలి అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు కానీ అర్ధంపర్ధం లేకుండా తలాతోక లేకుండా విమర్శలు చేయడం సరికాదు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో ఇమేజ్ పోతుంది … మీపార్టీలే ఉనికి కోల్పోతాయి అని తెలిపారు. రాజకీయాలకు అలవాటుపడిన ప్రతిపక్షానికి సంక్షేమం అవసరం లేదు. మీరు ప్రశ్నిస్తే ప్రజలు మాకెందుకు అధికారమిచ్చారో పునఃసమీక్ష చేసుకోవాలి అని పేర్కొన్నారు.
పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ కోసం ఇండియాలో బెట్టింగ్ వేస్తున్నారు. అయితే హైదరాబాద్ బాచుపల్లిలో ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. పాకిస్థాన్ లీగ్ కోసం ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తుంది. మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసిన మదాపూర్ పోలీసులు వీరి వద్ద నుండి 21 లక్షల రూపాయలు అలాగే 33 ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటన పై మాట్లాడిన సీపీ సజ్జనార్… చాలా మంది యూత్ ఈ బెట్టింగ్స్ లో […]
ఏపీలో బీజేపీకి ఓ సరదా సమస్య వచ్చి పడింది. ముఖ్యనేతల మీటింగ్‌లో అంతర్గత వ్యవహారాల చర్చ బయటకు వెళ్లిపోతుందట. పార్టీలో లోటుపాట్లు, నేతలకు అక్షింతలు సైతం మీడియాలో రావడంతో తలనొప్పిగా మారిందట. దీంతో పార్టీ సమావేశాల్లో అసలు చర్చ కంటే ముందు.. మీటింగ్ సీక్రసీపైనే ఎక్కువ చర్చ జరుగుతుందట. మీటింగ్ అంశాలు ఎవరూ బయట మాట్లాడొద్దని ఒట్టు వేయించుకున్నంత పని చేస్తున్నారట. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. పార్టీ మీటింగ్‌లకు రహస్యం అవసరమని భావిస్తున్నారా? ఏపీ […]
అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత ఐపీఎల్ తప్ప మరో కాంపిటిటివ్ క్రికెట్‌లో ధోనీ ఆడటం లేదు. అయితే కరీనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో ప్రస్తుతం తన టైమంతా ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు. అయితే ధోనీ ఆడినా ఆడకపోయినా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటాడు. ధోనీ కొత్త లుక్కే మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి షిమ్లా వెళ్లిన […]
WWE ఫేమ్ రెజ్లర్ కాళి ఇంట విషాదం నెలకొంది. కాళి తల్లి దలీప్ సింగ్ రాణా అనారోగ్యంతో మరణిచింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో లూధియానాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచింది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతోనే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. కాళి స్వస్థలం సర్‌మౌర్ జిల్లా ధిరానియా గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన దలీప్.. చిన్నతనంలో చదువుకు దూరమైన కూలీ పనులు చేశాడు. తన భారీ కాయాన్నే పొట్టకూటి కోసం […]
టోక్యోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హబ్బర్డ్.. ఒలింపిక్స్‌లో పోటీ చేయనున్న తొలి ట్రాన్స్‌జెండర్ కానున్నారు. ఆ దేశ మహిళల వెయిట్ లిఫ్టింగ్ జట్టు కోసం ఆమెను ఎంపిక చేశారు. ట్రాన్స్‌జెండర్‌గా మారకముందు ఆమె 2013లో మెన్స్ ఈవెంట్స్‌లో పాల్గొన్నది. హబ్బర్డ్ ఎంపిక పట్ల వివాదం చెలరేగుతోంది. మహిళ జట్టుకు లారెల్‌ను ఎంపిక చేయడం వల్ల ఆమెకు ఎక్కవ అడ్వాంటేజ్ ఉంటుందని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం ట్రాన్స్‌జెండర్ల సంఖ్యను […]
హుజురాబాద్‌పై వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ నేతలు ఫోకస్ పెట్టారా? ఆ నియోజకవర్గంలో వరస పర్యటనలు చేస్తున్నారా? ఉపఎన్నికలో ఓరుగల్లు అధికారాపార్టీ నాయకులే కీలకం కాబోతున్నారా? క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్! హుజురాబాద్‌లో మోహరించిన ఓరుగల్లు టీఆర్‌ఎస్ నేతలు తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గం హుజురాబాద్. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక రాబోతుంది. ఈ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నా.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆనుకుని ఉంటుంది. అందుకే […]
ఆయన ఫోన్ మోగిందంటే కాంగ్రెస్ నాయకులకు హడల్. గడిచిన కొన్ని రోజులుగా ఆయన వేట మామూలుగా లేదట. డైలీ ఏదో ఒక బాంబు పేల్చుతూనే ఉన్నారు. దీంతో మహాప్రభో.. ఏంటీ వాయింపు? అని తల పట్టుకుంటున్నారట పార్టీ నేతలు. ఇంతకీ ఎవరా లీడర్? ఎదురుపడితే బ్యాండ్ బాజానే! వి. హన్మంతరావు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన ఫోన్ చేస్తే భయపడుతూనే కాల్ రిసీవ్ చేసుకుంటారు నాయకులు. ఒకవేళ ఫోన్ ఆన్సర్ చేయకపోతే.. రేపటి రోజున ఆయనకు […]
కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అనంతపూర్ కర్నూలు కడప జిల్లాలో వర్గాలు ఉంటాయి పార్టీలు చూడరు. పాత రోజుల్లో కక్షల పెట్టుకుని ఒకరినొకరు చంపుకుంటూ ఫ్యాక్షనిజం ఈ మూడు జిల్లాలలో ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్న లోకేష్ ని నువ్వు ఎవడివిరా అని అడుగుతున్నా… నువ్వు ఒక బచ్చావి నీకు అసలు తెలుగు మాట్లాడటం సరిగా రాదు. నువ్వు పోటీ చేసిన ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా […]