ఏపీ ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయి అని ఎన్టీవీతో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. కాంట్రాక్టర్లకు అనుమతి లేకపోయినా టెండర్లు అప్పగించారు. ఇందులో అధికారులు, ప్రజా ప్రతినిధుల పాత్ర స్పష్టంగా ఉంది. అవకతవకలకు పాల్పడిన అందరిపై చర్యలు ఉంటాయి. నేను గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాను అని పేర్కొన్నారు. నేను బాధ్యతలు స్వీకరించే సమయానికి ఫైబర్ నెట్ 650 కోట్ల అప్పులో ఉంది. ఏపీ ఫైబర్ […]
కోల్‌బెల్ట్ ఏరియాలో ఆయన పట్టున్న నాయకుడు. వర్గపోరు పడక అప్పట్లో ఉన్న సంఘానికి గుడ్‌బై చెప్పి జాతీయ యూనియన్‌లో చేరారు. మళ్లీ ఏమైందో ఏమో.. సొంత గూటికి తిరిగొచ్చేశారు. ఆయన రాక ఒక సంచలనమైతే.. రీఎంట్రీ వల్ల లాభమా.. నష్టమా అనే చర్చ కూడా మొదలైంది. ఇంతకీ ఎవరా నాయకుడు మల్లయ్య రీఎంట్రీతో సింగరేణిలో చర్చ! కెంగర్ల మల్లయ్య. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం TBGKS వ్యవస్థాపకుల్లో ఒకరు. […]
ఆయన మంత్రిగా.. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదట. క్యాడర్ ఆయన్ను కలవాలన్నా అమరావతి.. లేకపోతే క్యాంప్ ఆఫీస్ అనేలా ఉండేది పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి అదే కారణమట. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పోయినచోటే వెతుక్కోవాలని చూస్తున్నారు. పనిలో పనిగా కుమారుడిని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒకే దెబ్బకు రెండు ఫార్ములాలు వర్కవుట్ చేసే పనిలో ఉన్నారట. ఆయనెవరో ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయంగా దూకుడు పెంచిన కళా వెంకట్రావు కళా వెంకట్రావ్. […]
విజయనగరం రురల్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. వాహనాల తనిఖీ నేపధ్యంలో విజయనగరం ఏజెన్సీ నుంచి విశాఖ వైపు వెళ్తున్న వాహనం పై అనుమానంతో తనిఖీ చేపట్టారు పోలీసులు. అందులో అల్లం మాటున గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. వాహనంలో అల్లం కాకుండా 3 వేల కేజీల గంజాయిని గుర్తించారు పోలీసులు. దొరికిన గంజాయి విలువ 1.50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దాంతో ఆ వాహనం తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నటు వెల్లడించారు ఎస్పీ […]
రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ లో విషాదం చోటు చేసుకుంది. భార్య తనతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్ అనే వ్యక్తి. ఇంట్లో తన గది లో ఫ్యాన్ కు తాడుతో ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడ్డాడు శ్రీకాంత్.ఉదయం ఎంతకీ శ్రీకాంత్ ఇంట్లో నుండి బయటకు రాకపోవడంతో అనుమానం తో కిటికీ తెరచి చూసిన స్థానికులకు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు శ్రీకాంత్. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. […]
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 465 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 04 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 869 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,683 కు చేరగా.. రికవరీ కేసులు 6,17,638 కు […]
నా రాజకీయ చరిత్రో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు అన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. టీడీపీ నాయకులు గ్రహించాలి. 2006 లో నేను రాంకీ సంస్థలో ఉద్యోగం చేసాను. 2006 నుండి 2021 వరకు రాంకీ గ్రూప్ లో ఏ విధమైన షేర్లు నాకు లేవు. అది రాంకీ గ్రూప్ సంస్థ లో జరిగిన ఐటీ దాడుల్లో రుజువు అయ్యింది. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఒక కంపెనీ, […]
ఉత్తర ఆంధ్ర ప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధముగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియరిక్ స్థాయిల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. పశ్చిమ రాజస్థాన్ మధ్య ప్రాంతాల నుండి తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా మరియు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ల మీదుగా […]