ఢీల్లి నుంచి ప్రత్యేక విమానంలో టోక్యోకు వెళ్లారు భారత అథ్లెట్లు. ఈనెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభమవుతుండటంతో భారత అథ్లెట్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దిల్లీ నుంచి బయలుదేరుతుండంగా పతకాలతో తిరిగి రావాలని అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు భారత షూటర్లు నిన్న ఉదయమే టోక్యోకు చేరుకున్నారు. క్రొయేషియా నుంచి భారత షూటర్లు వెళ్ళడంతో క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఢీల్లి నుంచి బయలుదేరిన భారత అథ్లెట్ల బృందం మాత్రం మూడు రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది.