ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాకు సంఘీభావం తెలిపారు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. క్యాప్టివ్ మైన్స్ ను వైజాగ్ స్టీల్స్ కు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదు అన్నారు. పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దాం. మనము ఓట్లు వేస్తే ఉన్న కేంద్ర ప్రభుత్వం… ప్రజల ఆలోచనలకు కట్టుబడి ఉండాలి. ఉక్కు ఫ్యాక్టరీ అమ్మితే సహించేది లేదు… ఆంధ్ర వాళ్ళము చూస్తూ ఉరుకొము. వెస్ట్ బెంగాల్,కేరళలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే దమ్ము కేంద్ర ప్రభుత్వంకు ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు… లాభాలకోసం కాదు అని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా జరిగే పోరాటంకు వైఎస్ జగన్ లీడ్ తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి అవసరం అయితే రాజీనామాలకు సిద్ధం అని పేర్కొన్నారు.