తెలంగాణలో రేపటి నుండి రైతు రుణమాఫీ ప్రారంభం కానుంది. రూ.2005.85 కోట్ల రుణమాఫీ చేయనున్నారు. దీని ద్వారా రూ.50 వేల వరకు రుణాలున్న 6,06,811 మంది రైతులకు లబ్ది చేకూరుతుంది. అయితే నేడు రుణమాఫీపై ట్రయల్ రన్ చేస్తున్నారు. రూ.25 వేల పైబడి రూ.25,100 వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్ చేస్తున్నారు. ఈ నెల 30 వరకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. అయితే […]
వరంగల్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు,తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు వెళ్లిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. జన్మదిన […]
శ్రీకాకుళం బందరువానిపేటలో పర్యటించారు మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. ఈ సందర్భంగా బోటు బోల్తా ఘటనలో మృతిచెందిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు అప్పలరాజు, ధర్మాన. మృతి చెందిన ముగ్గురు మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. తక్షణ సహాయం కింద ఐదులక్షల చొప్పున చెక్కులు అందించారు. మత్స్యకారులకు జగన్ ఎప్పుడూ అండగా ఉంటారు. మత్స్యకారుల అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం అని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణాలకు ప్రతిపాదనలు […]
గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ దుండగుడు విద్యార్థినిని కత్తితో పొడిచి చంపాడు. ఓ ప్రైవేట్ కళాశాలలో ఆమె మూడ సంవత్సరం చదువుతోంది. అయితే… ఇవాళ ఉదయం ఒంటరిగా ఉన్న రమ్యను చూసి… కత్తితో దాడిచేసి హతమర్చాడు. అయితే.. ఈ ఘటన పై హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ… బీటెక్ విద్యార్దిని రమ్యను తెలిసిన వ్యక్తే హత్య చేశాడు. హత్యకు ముందు ఘర్షణ పడ్డారు. పరిచయం వున్న వ్యక్తే అయినా […]
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్ లోని జాతీయగ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ (NIRD&PR) సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ . ఈ సందర్భంగా NIRD&PR డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ… 75 వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి 75 మెడిసినల్ ప్లాంట్స్ […]
తెల్లవారు మన అఖండ భారతాన్ని పరిపాలిస్తున్న రోజుల నుంచీ మనలో స్వతంత్ర కాంక్ష రగిలింది. అది రోజు రోజుకూ పెరిగింది. ఎందరో అమరవీరుల త్యాగఫలంగా మనకు స్వరాజ్యం లభించింది. బ్రిటిష్ వారు మన నేలను పాలిస్తున్న రోజులలోనే సినిమా కూడా తొలి అడుగులు వేసింది. ఆ సమయంలోనే కొందరు సాహసవంతులు ‘క్విట్ ఇండియా’ స్ఫూర్తితో “దూర్ హఠో దూర్ హఠో… ఓ దునియా వాలో… హిందుస్థాన్ హమారా…” అంటూ తమ చిత్రాల్లో నినదించారు. “మాకొద్దీ తెల్లదొరతనం…” అంటూ […]
నవరత్నాలు కూడా రాళ్ళే! కాకపోతే, ఖరీదైన రాళ్ళు. నవ్వితే నవరత్నాలు రాలే వరం ఎలాంటిదో తెలియదు కానీ, రాళ్ళపల్లి నవ్వుల్లో నవరత్నాలు రాలినట్టే ఉండేది. హాస్యనటునిగా అంతలా ఆకట్టుకున్నారు రాళ్ళపల్లి. తనదైన వాచకంతో, తన ఆంగికానికి తగ్గ అభినయంతో రాళ్ళపల్లి వందలాది చిత్రాల్లో నవ్వులు పూయించారు. ఒకప్పుడు పీలగా ఉంటూ నవ్వించిన రాళ్ళపల్లి కాలచక్రం కదలికల్లో బాగా బొర్రపెంచేశారు. ఆ బొజ్జతోనే నవ్వులు పూయించి మెప్పించారు. ఎక్కువగా నవ్వించినా, కొన్ని చిత్రాల్లో కవ్వించారు, మరికొన్నిట కన్నీరు పెట్టించారు, […]
ఓ సారి ఓ మెజీషియన్ జనం ఏది కావాలంటే అది తీసి ఇస్తున్నాడు. చివరకు స్టేజీపైకి ఏనుగు కావాలని కోరగానే, దానినీ తీసుకువచ్చాడు. ఇదంతా చూసిన ఓ అబ్బాయి వెళ్ళి ‘నన్ను తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోని చెయ్’ అని అడిగాడు. మెజీషియన్ చప్పున మాయమై పోయాడు. మళ్ళీ జనానికి కనిపించలేదు. ఈ కథ వింటే ఏమనిపిస్తోంది? ఎక్కడైనా హీరోగా రాణించవచ్చునేమో కానీ, ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో అది అంత సులువు కాదు అని […]
దేవాదాయశాఖ పేరు వింటేనే పవిత్రభావం కలగాలి. కానీ.. అక్కడ జరగని అరాచకం లేదు. అలా జరగకుండా చూడాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. మహాఅయితే తూతూ మంత్రంగా మమ అనిపించేస్తున్నారు. క్రమశిక్షణ ఉండాల్సిన శాఖ కట్టుతప్పడానికి రాజకీయ అండదండలేనట. వివాదాస్పదంగా మారిన వారిపై చర్యలు తీసుకోవడానికి పైవాళ్లు జడిసే స్థాయిలో నేతల మద్దతును వీళ్లు కూడగట్టారట. దేవాదాయశాఖలో తప్పు జరిగితే చర్యలు ఉండవ్! ఏపీ దేవాదాయశాఖ గాడి తప్పిందా? ఏదో ఒక గొడవ లేదా ఇంకేదో వివాదం.. […]
అంగన్వాడీ పాల అక్రమరవాణా కేసులో 26 మంది అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. గతనెల 3వ తేదీన శ్రీకాకుళం భామిని మండలం బత్తిలిలో 1919 లీటర్ల పాల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. పాలు అక్రమ రవాణా చేస్తున్న వాహనం సీజ్ చేసి , ఐదుగురిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ పాల అక్రమరవాణా కేసులో 40 రోజుల పాటు పోలీసులు దర్యాప్తు కొనసాగించగా విచారణలో వీరఘట్టం, వంగర మండలాలకు చెందిన 28 మంది అంగన్వాడీ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు […]