రాళ్ళపల్లి నవ్వుల్లో నవరత్నాలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవరత్నాలు కూడా రాళ్ళే! కాకపోతే, ఖరీదైన రాళ్ళు. నవ్వితే నవరత్నాలు రాలే వరం ఎలాంటిదో తెలియదు కానీ, రాళ్ళపల్లి నవ్వుల్లో నవరత్నాలు రాలినట్టే ఉండేది. హాస్యనటునిగా అంతలా ఆకట్టుకున్నారు రాళ్ళపల్లి. తనదైన వాచకంతో, తన ఆంగికానికి తగ్గ అభినయంతో రాళ్ళపల్లి వందలాది చిత్రాల్లో నవ్వులు పూయించారు. ఒకప్పుడు పీలగా ఉంటూ నవ్వించిన రాళ్ళపల్లి కాలచక్రం కదలికల్లో బాగా బొర్రపెంచేశారు. ఆ బొజ్జతోనే నవ్వులు పూయించి మెప్పించారు. ఎక్కువగా నవ్వించినా, కొన్ని చిత్రాల్లో కవ్వించారు, మరికొన్నిట కన్నీరు పెట్టించారు, ఇంకొన్నిట దుష్ట పాత్రల్లో చెలరేగిపోయారు. రాళ్ళపల్లి అభినయం అనేక చిత్రాలకు ఓ ఎస్సెట్ గానే నిలచింది.
రాళ్ళపల్లి ఆయన ఇంటిపేరు. అసలు పేరు వెంకట నరసింహారావు. 1945 ఆగస్టు 15న అనంతపురంలో జన్మించారు. పండితుల వంశంలో పుట్టడం వల్ల రాళ్ళపల్లికి పిన్నవయసులోనే పురాణాలపై పట్టు ఉండేది. ఆ జ్ఞానంతోనే పలు నాటకాల్లో శ్రావ్యంగా పాడుతూ ఆకట్టుకున్నారు. టీనేజ్ లో అడుగు పెట్టేసరికే రాళ్ళపల్లి రంగస్థలంపై మంచిపేరు సంపాదించుకున్నారు. అనేక వైవిధ్యమైన పాత్రల్లో అలరించారు. కానీ, చిత్రసీమ వైపుకు ఆయన పయనం ఆలస్యంగా సాగడానికి ఊరూరా వేషాలు వేయడమే కారణమని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘స్త్రీ’లో కీలక పాత్రలో కనిపించిన రాళ్ళపల్లి తరువాత తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేస్తూ పోయారు. ‘సీతాకోకచిలుక’లో రాళ్ళపల్లి పాత్రకు మంచి పేరు లభించింది. తరువాత మహానటుల చిత్రాల్లోనూ పాత్రలు దక్కాయి. దాంతో నటునిగా ఇట్టే గుర్తింపు సంపాదించేశారు. ‘అభిలాష’లో సెంట్రీగా నటించి ఆకట్టుకున్నారు. “శుభలేఖ, ఖైదీ, చండశాసనుడు, మంత్రిగారి వియ్యంకుడు, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ప్రేమించు పెళ్ళాడు” వంటి చిత్రాల్లో రాళ్ళపల్లి నటన ఇట్టే జనాన్ని పట్టేసింది. విలక్షణ దర్శకుడు వంశీకి రాళ్ళపల్లి నటనలోని ఈజ్ ఎంతగానో నచ్చింది. వంశీ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘అన్వేషణ’లో రాళ్ళపల్లి కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత వంశీతో పాటు అనేక మంది ప్రముఖ దర్శకులు తమ చిత్రాల్లో రాళ్ళపల్లికి తగ్గ పాత్రలు ఇస్తూ వచ్చారు. అన్నిటా తనదైన బాణీ పలికిస్తూ సాగారు రాళ్ళపల్లి.
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
తాను బాగుండడమే కాదు, ఇతరులూ బాగుండాలని అభిలషించేవారు రాళ్ళపల్లి. నటుడు తనికెళ్ళ భరణికి ఆ రోజుల్లో షెల్టర్ ఇచ్చి ప్రోత్సహించింది ఈయనే. ఈ విషయాన్ని భరణి సైతం ఎన్నో సార్లు చెప్పుకున్నారు. అయితే అందుకు రాళ్ళపల్లి అంగీకరించేవారు కారు. “నాకు చేతనైంది నేను చేశాను. అంతేకానీ, భరణి పైకి రావడానికి ఆయన ప్రతిభే కారణం” అంటూ ఉండేవారు రాళ్ళపల్లి. ఆయన అభినయానికి అనేక అవార్డులూ రివార్డులూ లభించాయి. “పట్నం పిల్ల- పల్లెటూరి చిన్నోడు, జీవనజ్యోతి” చిత్రాల ద్వారా ఉత్తమ హాస్యనటునిగా నంది అవార్డులు అందుకున్నారు రాళ్ళపల్లి. టీవీ సీరియల్స్ లోనూ తనదైన బాణీ పలికించారు. కడదాకా తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికే తపించారు రాళ్ళపల్లి. 2019 మే 17న రాళ్ళపల్లి కన్నుమూశారు. ఆయన నటించిన అనేక చిత్రాలు ఇప్పటికీ బుల్లితెరపై దర్శనమిస్తూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!