ఓమిక్రాన్ కేసుల మధ్య మూడు టెస్ట్ ల సిరీస్ లో తలపడేందుకు సౌత్ ఆఫ్రికా కు వెళ్ళింది టీం ఇండియా. అయితే ఈ రోజు భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి టెస్ట్ పార్రంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీసుకొని అతిథులకు మొదట బౌలింగ్ ఇచ్చాడు. అయితే ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికాను ఒక్క సిరీస్ లో కూడా వారి సొంత గడ్డపై టీం ఇండియా ఓడించలేదు. దాంతో ఈ సిరీస్ లో ఎలాగైనా అతిథులకు వారి గడ్డపై ఓటమి రుచి చూపించాలని కోహ్లీ సేన భావిస్తుంది. చూడాలి మరి ఈ మొదటి మ్యాచ్ లో భారత జట్టు గెలుస్తుందా.. లేదా అనేది.
ఇండియా : కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విరాట్ కోహ్లి(C), అజింక్యా రహానే, రిషబ్ పంత్(WK), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
సౌత్ ఆఫ్రికా : డీన్ ఎల్గర్(C), ఐడెన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, టెంబా బావుమా, క్వింటన్ డి కాక్(WK), వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి