కీలక మీటింగ్స్‌లో టీ కాఫీలకే పరిమితం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిఫినీలు తిన్నారు.. కాఫీలు తాగారు. కీలక సమావేశంలో ల్యాప్‌టాపుల్లో మునిగిపోయారు. ఒకరు 14 అంటే.. ఇంకొకరు 34కి తగ్గేది లేదన్నారు. ఆ మీటింగ్స్‌లో ఇదే జరుగుతోందా? కాలక్షేపం కబుర్లు.. వ్యూహాత్మక ఎత్తుగడలతో సమావేశాలను మమ అనిపించేస్తున్నారా?
పీఆర్సీపై ఎడతెగని చర్చలు..!
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
ఏపీలో లక్షలాది మంది ఉద్యోగులకు కీలకమైన పీఆర్సీ కసరత్తు కొలిక్కి రాలేదు. ఫిట్‌మెంట్‌పై తేలుస్తారా తేల్చరా అని ఉద్యోగ సంఘాలు గట్టిగా అడగడంతో… ఆ మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు అధికారులు. 13 సంఘాలకు ఆహ్వానాలు వెళ్లడంతో వారంతా సూచించిన టైమ్‌కు చెప్పిన లొకేషన్ బ్లాక్ నెంబర్ 2 దగ్గరకు వచ్చేశారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో ఆర్ధికశాఖ కార్యదర్శులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఉద్యోగ సంఘ నాయకులు కమిటి హాల్‌లోకి వెళ్లి కూర్చున్నారు. ఐదు కావటానికి పావుగంట ముందే సీఎస్ సచివాలయం నుంచి తాడేపల్లిలోని సీఎమ్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోవడంతో అంతా కంగుతిన్నారు.
టిఫిన్లు.. టీ కాఫీలతోనే సమయం గడిచిపోయిందా?
సీఎస్ లేకపోయినా ముగ్గురు ఆర్ధికశాఖ కార్యదర్శులు మీటింగ్ హాలులో ఉండటంతో ఉద్యోగ సంఘాల నేతలు సర్ది చెప్పుకొన్నారట. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. హెచ్‌ఆర్ ఫైనాన్స్ కార్యదర్శి శశిభూషణ్ సమావేశానికి వచ్చిన నేతల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. మిగిలిన ఇద్దరు కార్యదర్శులు రావత్, సత్యనారాయణలు తమతో తెచ్చుకున్న ల్యాప్ టాపుల్లో మునిగిపోయి.. తమ సమయం వృథా కాకుండా చూసుకున్నారట. దీంతో సీఎస్ వచ్చేంత వరకు మాటలు కలుపుతా.. అసలు విషయం పెద్దాయనతోనే మాట్లాడుకోవాలని చెప్పారట శశిభూషణ్. సీఎస్ రావటం లేటవుతుందేమో.. షుగర్ పేషెంట్స్‌కు ఇబ్బంది లేకుండా మరోదఫా స్నాక్స్ తెప్పిస్తాను.. అని సెటైర్లు వేశారట. టిఫిన్లు తిని, చల్లటి ఏసీ రూమ్‌లో వేడి వేడిగా టీ కాఫీలు తాగి.. నాయకులంతా పాత రీల్ మళ్లీ రీప్లే చేయడంతో అక్కడున్నవాళ్లకు సౌండ్ లేదట.
లెక్కలు మళ్లీ వెరిఫై చేస్తామన్న సీఎస్
ఉస్సూరుమంటూ బయటకొచ్చిన ఉద్యోగులు
రాత్రి 8 గంటలకు సీఎస్ సమీర్ శర్మ సచివాలయానికి వచ్చారు. అప్పటికే వెయింటింగ్‌లో ఉన్న JAC నేతలు అలిసిపోయి ఉంటారని భావించారో ఏమో.. 14 శాతం ఫిట్‌మెంట్‌తో సరిపెట్టేద్దాం అని సీఎస్ చెబితే.. ఉద్యోగ సంఘాల నాయకులు 34కి తగ్గేది లేదని సమాధానం ఇచ్చారు. 14 శాతం ఫిట్‌మెంట్ నివేదిక తప్పుల తడకగా కొట్టిపారేశారు JAC నేతలు. ఇలా పావు గంట గడిచాక.. అధికారులు చాణక్యం ప్రదర్శించారు. మా లెక్కలు తప్పంటున్నారు కదా.. మళ్లీ లెక్కలు వెరిఫై చేస్తాం అని బదులివ్వడంతో… మీటింగ్‌లో ఏదో తేలిపోతుందని అనుకున్న ఉద్యోగులకు ఆ సమాధానం మింగుడుపడలేదు. ఇదంతా కాదు సీఎం దగ్గరే తేల్చుకుంటా అని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడంతో.. చిరునవ్వులు చిందించారట అధికారులు. అయితే ఓకే.. ఇప్పుడు సీఎం ఉండరు. మళ్లీ వచ్చే వారమే అని మీటింగ్‌కు క్లోజ్ చేశారట. ఎంతో ఉత్సాహంతో మీటింగ్‌కు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతల ఉస్సూరు మంటూ బయటకొచ్చారు. ఏమైంది అని మీడియా ప్రశ్నిస్తే.. ఏముందీ ఈ మీటింగ్ కూడా మమ అనిపించారని నిట్టూర్పులిడిచారు. అదండీ.. పీఆర్సీపై మీటింగ్‌లో టీ కాఫీలకు, టిఫిన్లకు ఇస్తున్న ప్రాధాన్యం.. సమస్య పరిష్కారనికి ఇవ్వడం లేదని సచివాలయ వర్గాల్లో ఒక్కటే సణుగుడు.
తాజావార్తలు
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
-
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!