లుధియానా పేలుళ్ల కేసులో వెలుగులోకి కొత్త విషయాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లుధియానా కోర్టు పేలుళ్ల కేసులో…సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. మాజీ కానిస్టేబుల్…తన మీద నమోదైన కేసుల ఫైళ్లను కాల్చేసేందుకే…ఈ కుట్రకు పాల్పడినట్లు విచారణలో తేలింది. గగన్ దీప్‌కు…డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
పంజాబ్‌లో కలకలం సృష్టించిన లుథియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు ఘటనలో ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయ్. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని.. 2019లో డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు. ఘటనాస్థలంలో మొబైల్ సిమ్‌కార్డు, వైర్‌లెస్ డోంగిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా మృతుడిని గగన్‌దీప్ సింగ్‌గా నిర్దారించారు.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
లుథియానాలోని ఖన్నా ప్రాంతానికి చెందిన గగన్‌దీప్‌ను మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో…2019లో విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రెండేళ్ల పాటు జైల్లో ఉన్న గగన్‌దీప్.. సెప్టెంబరులో బెయిల్‌పై విడుదలయ్యాడు. కేసు విచారణలో భాగంగా అతడు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే కేసు నుంచి బయటపడేందుకు అతడు ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కేసుకు సంబంధించిన పేపర్లను భద్రపరిచే కోర్టు రికార్డు గదిని బాంబుతో పేల్చేయాలని ప్రణాళిక చేసుకున్న గగన్‌దీప్.. వాష్‌రూంలో బాంబును అమర్చుతుండగా ఒక్కసారిగా అది పేలిపోయింది. పేలుడు ధాటికి అక్కడున్న నీటి పైపు పగిలిపోయింది. బాంబుకు సంబంధించిన కీలక భాగాలు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో దర్యాప్తు క్లిష్టంగా మారిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే పేలుడు పదార్థాలను గగన్‌దీప్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. నిందితుడి సోదరుడు, స్నేహితులను విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!