ఈటల మాకు ఏమి సాయం చేయలే అని మీ ముదిరాజులే చెబుతున్నరు. ఈటల మంత్రిగా ముఖ్యమంత్రి అండదండలతో అంతో గింతో ఇక్కడ పని చేసిండు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కానీ ఆయనిప్పుడు ఒక వ్యక్తి మాత్రమే,మనకు వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యం అని తెలిపారు మంత్రి కొప్పుల. బీజేపీ ఇంతవరకు ఏమి చేయకపోగా,మంచి పనులు చేస్తున్న మన ముఖ్యమంత్రికి అడ్డుపుల్లలు ఏస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఎంపీ బండి సంజయ్ మీ దగ్గరకు […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, నవ్యాంధ్రలుగా ఏర్పడ్డాక రాజకీయంలో స్పష్టమైన మార్పు వచ్చేసింది. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించగా.. ఏపీ మాత్రం లోటుబడ్జెట్ రాష్ట్రంగా మిగిలిపోయింది. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పినా.. అది నీటిమీద రాతలుగా మిగిలిపోయింది. హైదరాబాద్ ను తానే నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో కనీసం ఏపీకి రాజధానిని కూడా నిర్మించకపోవడం శోచనీయంగా మారింది. తన పాలనలో సంక్షేమాన్ని పెద్దగా […]
ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనానికి పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేసారు. అయితే హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నేడు ఆ ఏర్పాట్లను పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై చేసిన సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయిల్ రన్ నిర్వహించారు అధికారులు. అనంతరం సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక మైన ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టం ని వాడుతున్నాం. అలాగే ట్యాంక్ బండ్ పై ఈ సారి క్రేన్ల […]
టీ20 వరల్డ్ కప్ 2021 వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ నిర్వహణ హక్కులు బీసీసీఐ కే ఉన్న భారత్ లో కరోనా కారణంగా యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. అయితే ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో ఒక్కొక్కటిగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇక తాజాగా పాకిస్థాన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే […]
జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద నీరు కొనసాగుతుంది. హిమాయత్‌సాగర్‌లోకి ప్రస్తుతం 800 క్యూసెక్కుల వచ్చి చేరుతుంది. హిమాయత్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.10 అడుగులకు నీరు చేరింది. దాంతో హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా మూసీ లోకి 700 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇక ఉస్మాన్ సాగర్ లోకి 1200 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఉస్మాన్‌సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1789.50 అడుగులుగా […]
తెలంగాణలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది.. అన్న విషయంలో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న బద్వేల్ నియోజకవర్గంతో కలిపి.. దీపావళి తర్వాతే ఈ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న స్పష్టతను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఇచ్చేసింది. ఏపీలో చూస్తే.. పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే ఉంది. హుజురాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ చతుర్ముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. […]
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న VTIXK ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేసారు. అయితే విమానంలోని బాత్ రూమ్ లాక్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన ఆధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసారు. అనంతరం… హూటా హూటీన సిఐఎస్ఎఫ్ ఆధికారులను రప్పించి తనిఖీ చేయడంతో విమానంలోని బాత్ రూమ్ లో అక్రమ బంగారం లభ్యం […]
టీడీపీలో భావి సీఎంగా ప్రచారం అవుతున్న లోకేష్ బాబును వచ్చే ఎన్నికలకు పక్కన పెడుతున్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2024 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నారా లోకేష్ ను ప్రకటించాలని చంద్రబాబు భావించారు. ఈక్రమంలోనే కొద్దిరోజలుగా టీడీపీలో లోకేష్ నాయకత్వాన్ని ప్రొజెక్టు చేసేలా కార్యక్రమాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే టీడీపీ సీనియర్లు మాత్రం లోకేష్ నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గురు పూజోత్సవం. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్న, ఎంతటి స్థాయి కి ఎదిగిన గురువు గుర్తుకు వస్తారు. ఉపాధ్యాయ ఎంఎల్ సి అని గురువులు చట్టసభల్లో ఉండాలని పెట్టుకున్నాం. విద్య ఉద్యోగం కోసం కాదు, ఉన్నతమైన గౌరవం కోసం అని తెలిపారు. […]
దాదాపు రెండేళ్లుగా ప్రపంచం కరోనా గుప్పిట్లోనే మగ్గుతోంది. కోవిడ్-19కి విరుగుడుగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజల్లో మాత్రం ఆ మహమ్మరి సృష్టించిన భయం మాత్రం పోవడం లేదు. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా ప్రభావం ఎక్కువగానే కన్పిస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్ లో ఎంతో అప్రమత్తంగా ఉన్న ప్రభుత్వం సెకండ్ వేవ్ లో పాలకుల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంది. అక్టోబర్ నెలలో థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడంపై భిన్నాభిప్రాయాలు […]