ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 6,984 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 247 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,710,628 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,76,135 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,562 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది […]
భారత వన్డే జట్టుకు కాప్టెన్ గా కొనసాగాలి అనుకున్నా… తనను బీసీసీఐ తప్పించింది అనే కోపంతో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే అతను రాబోయే సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ తర్వాత జరగనున్న వన్డే సిరీస్ నుంచి వ్యక్తిగత కారణాల పేరుతో కోహ్లీ తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై తాజాగా ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. కోహ్లీ వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు […]
తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసింది లావణ్య త్రిపాఠి. ‘అందాలరాక్షసి’గా జనం ముందు నిలచిన లావణ్య త్రిపాఠి, తన అందాల అభినయంతో ఆకట్టుకుంటూ సాగింది. తెలుగు సినీజనం లావణ్యకు మంచి అవకాశాలే కల్పించారు. ఆమె కూడా తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయడానికే తపిస్తున్నారు. లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి లాయర్. తల్లి టీచర్. డెహ్రాడూన్ లో లావణ్య విద్యాభ్యాసం సాగింది. ముంబయ్ లో రిషీ […]
తెలంగాణ రక్త చరిత్రను ‘కొండా’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కొంతకాలం నక్సలిజం నీడలో గడిపి, ఆపైన రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజానాయకుడిగా ఎదిగిన కొండా మురళీ జీవన ప్రయాణం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అదిత్ అరుణ్, ఇరా మోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘కొండా’ షూటింగ్ ను కొద్ది రోజుల క్రితం వరంగల్ లో మొదలు పెట్టారు. అయితే ఊహించని ఇబ్బందుల కారణంగా అక్కడ పూర్తి స్థాయిలో షెడ్యూల్ […]
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29, 228 శాంపిల్స్ పరీక్షించగా.. 132 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 186 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,08,27,634 కు […]
దగ్గుబాటి రానా బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 14 ఉదయం ‘భీమ్లా నాయక్’ నుండి అతను నటిస్తున్న డేనియల్ శేఖర్ క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ను శుభాకాంక్షలు చెబుతూ విడుదల చేసిన చిత్ర బృందం సాయంత్రం ఓ డైలాగ్ టీజర్ ను రిలీజ్ చేసింది. భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ కూడా కనిపించే ఈ ప్రచార చిత్రాన్ని చూస్తే, “వాడు అరిస్తే భయపడతానా, ఆడికన్నా గట్టిగా అరవగలను… ఎవడాడు!? దీనమ్మ దిగొచ్చాడా!? ఆఫ్ట్రాల్ ఎస్. ఐ., […]
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, యువ దర్శకుడు వెంకీ కుడుమలతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. చిరంజీవికి మెగా ఫ్యాన్ అయిన వెంకీ కుడుమల ఈ అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. దానిని సరదాగా ఓ చిన్న వీడియో రూపంలో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ట్వీట్ చేసింది. ‘ఇలాంటి అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుందని, తనపై ఉంచిన […]
సౌత్ ఆఫ్రికా సిరీస్ లో భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిన్న ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. దాంతో ఈ సిరీస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటిస్తున్న సమయంలోనే రోహిత్ ను భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ తర్వాత జరగనున్న వన్డే […]
తెలుగువారికి మలయాళం మాట్లాడటం ఎంత కష్టమో! మలయాళీలకు తెలుగు భాష మాట్లాడటమూ అంతే కష్టం. అయితే తొలిసారి తెలుగు సినిమా ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్ర చేస్తున్న మలయాళ నటుడు దేవ్ మోహన్ మాత్రం ఇష్టపడి, కష్టపడి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ […]
హ్యాండ్ సమ్ హీరో నాగశౌర్య సొంత బ్యానర్ లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘అశ్వద్థామ’ గత యేడాది జనవరి 31న విడుదలైంది. ఇక ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ అనంతరం నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను, లక్ష్య’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం నాగ శౌర్య ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ తో పాటు సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లోనూ ఓ మూవీ చేస్తున్నాడు. షీర్లే సేతియా హీరోయిన్ గా పరిచయం […]