భారత్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 28,591 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూవాయి.. మరో 338 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 34,848 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు దేశ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,36,921కు చేరుకోగా.. రికవరీ కేసులు 3,24,09,345కి పెరిగాయి.. ఇక, […]
ప్రత్యేక హోదా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తీరని కలే అని చెప్పుకోవాలి. అది ఇచ్చేది లేదని.. ఇచ్చే అవకాశమూ లేదని మోడీ ప్రభుత్వం వీలు దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంది. ప్రజలు కూడా ఈ విషయంలో హోప్స్ వదిలేసుకున్నారు. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం హోదాపై అవకాశాలు కల్పించుకుని మరీ కేంద్రం దృష్టికి తీసుకుపోతున్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారు. తాజాగా.. పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నేతృత్వం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి.. మళ్లీ […]
సొంత పార్టీ నేతల నిర్ణయం ఆ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిందా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కేడర్ గుర్రుగా ఉందా? ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్మానం చేసేశారా? పార్టీ సంస్థాగత ఎన్నికలను బహిష్కరించడంతో.. ఎమ్మెల్యేకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందా? ఆయన ఎవరో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్యే పైళ్లకు పార్టీ శ్రేణుల నుంచే ఎదురుగాలి? పైళ్ల శేఖర్‌రెడ్డి. భువనగిరి ఎమ్మెల్యే. ఈ అధికారపార్టీ శాసనసభ్యుడికి ఇన్నాళ్లూ ఎలా ఉన్నా.. ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో కేడర్ నుంచి […]
ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 దేశంలో కరోనా కేసులు పెరగడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ సెకండ్ హాఫ్ సెప్టెంబర్ 19 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం అవుతుంది. దాంతో ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకోగా ఆటగాళ్లు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఈ ఐపీఎల్ ప్రారంభంలోనే గాయాల కారణంగా, కరోనా కారణంగా కొంత మంది ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుండి తప్పుకోగా […]
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వీరికి బయటి శత్రువుల కంటే లోపటి శత్రువులే ఎక్కువ అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతుంటారు. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ ను ఈదలాంటే చిన్నచిన్న చేపలు బలి కావాల్సిందనేలా ఆపార్టీ నేతల తీరు ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి అంటే నేతలంతా సీఎం పదవితో సమానంగా చూస్తుంటారు. దీని కోసం నేతల మధ్య కుస్తీలు మామూలుగా ఉండవు. ఈ విషయం మొన్నటి టీపీసీసీ చీఫ్ నియామకంతో […]
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ యుగం నడుస్తోంది. చెప్పింది చెప్పినట్లు చేసుడే తప్ప.. మాట తప్పడం మాకు తెల్వదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రేపురా.. మాపురా అనే ఉద్దెర బేరాలు మా దగ్గర ఉండవు. బీజేపీ పాలనలో పెట్రోలు, డిజీల్, గ్యాస్ ధరలు పెరిగాయి. గ్యాస్ సబ్సిడీ తగ్గించారు. అయినప్పటికీ పువ్వు గుర్తుకే ఓటు వేస్తే.. సిలిండర్ ధర 1500 అవుతుంది అని తెలిపారు. బొట్టుబిల్లలు, గోడగడియారాలు ఇస్తామన్న మాటలు ఆపేసి.. సిలిండర్ ధర, […]
నిత్యం ఏదో ఒక సమస్య. ఒకటి కొలిక్కి వస్తే.. ఇంతలోనే మరో ఇబ్బంది. రాజకీయంగా ప్లస్‌లో పడ్డామన్న సంతోషం క్షణకాలమైన ఉండటం లేదట ఆ ఎమ్మెల్యేకు. ఆనందం ఆవిరైపోతోందట. ఇంతకీ ఎమ్మెల్యేకు వచ్చిన సమస్యేంటి? ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్! ఆనంద్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి స్థానిక నేతలు ఫోకస్! మెతుకు ఆనంద్. వృత్తిరీత్యా డాక్టరైన ఆనంద్.. రాజకీయాలపై ఆసక్తితో టీఆర్ఎస్‌లో చేరి.. 2018 ముందస్తు ఎన్నికల్లో వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో […]
ప్రకృతిని చూసి పరవశించన వాళ్లుంటారా? పచ్చని ప్రకృతిలో కాసేపు సేదతీరినా మనసుకు ఎంతో హాయిగా ..ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి నేచర్‌లో ..అందునా చెట్ల పైన ఏర్పాటు చేసిన దారిలో నడుచుకుంటూ వెళితే ఎలా వుంటుంది? అసలు అలాంటివి ఉంటాయా అంటే…ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లోని అటవీ ప్రాంతంలో ప్రపంచంలోనే పొడవైన ట్రీ టాప్ వే ఏర్పాటు చేశారు. అది పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ట్రీ టాప్‌వే అంటే చెట్ల పైనుంచి దారి. ఇది స్విట్జర్లాండ్‌లోని పేరు సెండా డిల్ డ్రాగున్. […]
కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ 2021 ను యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ప్రారంభిస్తుంది బీసీసీఐ. అందుకోసం ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఇక ప్రస్తుతం భారత జట్టు మాత్రం 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ నిన్న రద్దయిన విషయం తెలిసిందే. ఆ కారణంగా వరం రోజులో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ఆటగాళ్లు అందరూ తిగిరి […]
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై ప్రజలు ఆసక్తి కబరుస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఎవరు అధికారం చేజిక్కింకుంటారో.. వారిదే కేంద్రంలో అధికారం.. కాబట్టే ఆ రాష్ట్రం గురించిన చర్చ జోరుగా సాగుతోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకుంటామని బీజేపీ సర్కారు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, తదితర పార్టీలన్ని గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా పని చేసిన మాయవతి తన అదృష్టాన్ని […]