కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ 2021 ను యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ప్రారంభిస్తుంది బీసీసీఐ. అందుకోసం ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఇక ప్రస్తుతం భారత జట్టు మాత్రం 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ నిన్న రద్దయిన విషయం తెలిసిందే. ఆ కారణంగా వరం రోజులో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ఆటగాళ్లు అందరూ తిగిరి యూఏఈఐ చేరుకోనున్నారు. ఈ తరుణంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తమ జట్టు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీని అలాగే పేసర్ సిరాజ్ ను యూఏఈకి రప్పించే ఏర్పాట్లు చేసింది. ఆర్సీబీ యాజమాన్యం ఏర్పాటు చేసిన స్పెషల్ చార్టర్ ఫ్లైట్ లో ఐపీఎల్ కోసం ఈరోజే కోహ్లీ, సిరాజ్ బయల్దేరనున్నారు. నేడు రాత్రి వీరు ఇంగ్లాండ్ న్నుండి బయల్దేరి రేపు ఉదయం యూఏఈకి చేరుకోనున్నారు.