జ్యోతిరాదిత్య సిందియా ప్రగతి భవన్ కు వెళ్లడంతో తెలంగాణ బిజెపి నేతలు ఇరకాటంలో పడ్డారా ఇప్పటికే కేసీఆర్ డిల్లీ టూర్ ఓ పక్క, హుజూరా బాద్ ఎన్నికల షెడ్యూల్ రాక పోవడం మరోపక్క తెలంగాణ బిజెపి నేతల్ని ఇబ్బందుల్లో పడేశాయి. ఇప్పుడు కేంద్రమంత్రులు కూడా ప్రగతిభవన్ కి వెళ్లి కెసీఆర్ ని కలుస్తున్నారు.. తెలంగాణలో టియ్యారెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ రాష్ట్ర నేతలు ఈ పరిణామాలతో టెన్షన్ పడుతున్నారట. ఓ వైపు తెలంగాణ బీజేపీ […]
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం పోలికల్ వార్ నడుస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా గత కొంతకాలంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో ఈ రెండు పార్టీలు తెగ హడావుడి చేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ పార్టీలు జనసమీకరణపై దృష్టి పెట్టడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ రెండు పార్టీలు సెప్టెంబర్ […]
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 45,553 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1,190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,29,985 కి చేరింది. ఇందులో 20,00,877 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో 1,226 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, రాష్ట్రంలో […]
ఓ ఐదేళ్ల క్రితం అక్కడ ఫ్లై ఓవర్ వస్తుందంటే అందరూ గగ్గోలు పెట్టారు.అప్పటి ఎమ్మెల్యే, ఎంపీ చొరవ తీసుకోవడంతో ఫ్లై ఓవర్ కాస్తా బైపాస్ గా మారింది. కట్ చేస్తే మళ్లీ సీన్ రిపీట్ అవుతోంది. ఇదే స్థానిక అధికారపార్టీ నేతలకు తలనొప్పిగా మారిందట. ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో పడిపోయారట. ఇంతకీ ఎచ్చెర్ల వైసీపీ నేతల్లో బైపాస్ కలవరానికి కారణమేంటి ? శ్రీకాకుళం జిల్లాకు ముఖద్వారమైన ఎచ్చెర్లలో ఇప్పుడు రాజకీయమంతా బైపాస్ […]
యువనేతలు ఎదగాలంటే సరైన సందర్భాలు కావాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.అప్పుడే రాజకీయంగా ఎదుగుతారు. తెలంగాణ బిజెపి యువనేతలకు సంజయ్ యాత్ర రూపంలో ఓ ఛాన్స్ వచ్చింది. తమ టాలెంట్ రుజువు చేసుకోటానికి శాయశక్తులా కష్టపడుతున్నారట. పాదయాత్ర చేస్తున్న సంజయ్ టార్గెట్ ఒకటైతే, వారసుల టార్గెట్ మరొకటిగా మారింది.. సంజయ్ సంగ్రామ యాత్రలో నేతల వారసులు హడావుడి చేస్తున్నారు. పనిలో పనిగా కమలం పార్టీలో తమ భవిష్యత్ కి గట్టి పునాదులు వేసుకుంటున్నారు. పాదయాత్ర వేదికగా తమ […]
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌పై తుది నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు తేలట్లేదు. మ్యాచ్‌ను వచ్చే ఏడాది వీలును బట్టి నిర్వహిస్తారని వార్తలొస్తున్నా.. ఇందుకు బీసీసీఐ కూడా అంగీకారం తెలిపినప్పటికీ.. తుది నిర్ణయం ఏంటన్నదే తెలియడం లేదు.ప్రస్తుతం రద్దయిన మ్యాచ్‌ను తర్వాత నిర్వహించుకునే అవకాశాన్ని ఈసీబీకి ఇచ్చామని. ఇరు బోర్డులు కలిసి ఈ మ్యాచ్‌ను మళ్లీ ఎప్పుడు ఆడించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాయన్నారు బీసీసీఐ కార్యదర్శి జై షా. […]
ఏడుకొండలు ఎక్కాలంటే వాళ్ళ ప్రాపకం వుండాల్సిందేనా ? కోవిడ్ నిబంధనల పేరుతో తిరుమలలో ఆంక్షలు పెరిగిపోతున్నాయా? ఆపద మొక్కులవాడిని అలిపిరి వద్దే వేడుకుని వెనుతిరగాలా? దర్శనం కావాలంటే శ్రీవారి అనుగ్రహం ఒక్కటి సరిపోదా? ఆపదమొక్కులవాడు. కోరిన వారి కోర్కెలు ఇట్టే తీర్చే దేవుడిగా పేరొందిన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారు. స్వామి వారి దర్శనార్దం అలిపిరి వద్దకు చేరుకున్న భక్తులకు ఎలాంటి ఆంక్షలు వుండవు. టిటిడి చెబుతున్నట్లు సప్తగిరులు పవిత్రమైనవే. అడుగడుగునా […]
యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ‘ఎమ్మా’ మొదటి నుంచి ప్రత్యర్థి ‘లెలా’పై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా కూడా భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. రెండో సెట్‌లో కూడా అదే దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా రెండో సెట్‌ను .. 6-3 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో వరుస సెట్లలో విజయం సాధించిన ఎమ్మా.. తన కేరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్‌ను సాధించింది. […]
తెలంగాణ కాంగ్రెస్ ని ఆమె ఇరుకున పెట్టేశారా..? హుజూరాబాద్ అభ్యర్థి కోసం వెతుకుతున్న సమయంలో… ఆ మహిళా నేత కామెంట్స్ పార్టీని మరింత గందరగోళం లోకి నెట్టాయా..? ఇప్పుడు హుజూరాబాద్, తర్వాత వరంగల్ అంటున్నారట. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఏదో అనుకుంటే మరేదో జరిగిందా? తెలంగాణ కాంగ్రెస్ హుజూరాబాద్ అభ్యర్ధి ఎంపిక పై పెద్దగా తర్జనభర్జనలు పడలేదు. కానీ, బలమైన అభ్యర్దిని బరిలోకి దించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా నే బీసీ సామాజిక వర్గం […]