ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఈరోజు ఉదయం బసవతారకం ఆసుపత్రిలో ఉదయం 8 గంటల ముప్పై నిముషాలకు మృతిచెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాశేఖర్ పలువురు సినీ ప్రముఖులు బసవతారకం హాస్పిటల్ కి వెళ్లి ఉత్తేజ్ ని పరామర్శించారు. అయితే గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు సమాచారం. ఉత్తేజ్ చేసే సేన కార్యక్రమాలలో ఆయన భార్య పద్మ కూడా ఎప్పుడు భాగమయ్యేవారు. అయితే […]
కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 యూఏఈ వేదికగా జరగనుండటంతో ప్రస్తుతం భారత ఆటగాళ్లు అందరు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ఐపీఎల్ ముగియగానే యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించగా… ఆ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా… రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ప్రపంచ కప్ ముగిసిన […]
తెలంగాణ విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నేడు ప్రభుత్వ జూనియర్ కాలేజి ల ప్రిన్సిపాల్స్ కలవనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజి లను నడపలేము. ఫ్యాకల్టీ లేక క్లాస్ లు నడవడం లేదు అని ప్రిన్సిపాల్స్ తెలిపారు. కాలేజి ల నుండి పిల్లలు తల్లిదండ్రులు టిసిలు తీసుకొని వెళ్లిపోతామంటున్నారు పదుల సంఖ్యలో కాలేజి లు గెస్ట్ లెక్చరర్ లతో నడుస్తున్నాయి అని తెలిపారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 90 శాతం గెస్ట్ ఫ్యాకల్టీతోనే నడిపిస్తున్నారు. […]
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ రద్దు కావడంతో భారత ఆటగాళ్లు అందరు ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకుంటున్నారు. కానీ టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. అయితే టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగోవ టెస్ట్ సమయంలో రవిశాస్త్రి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చివరి టెస్ట్ ప్రారంభ సమయంలో మరోకొంత మంది భారత సహాయక సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని […]
వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఒడిషా తీరాన్ని ఆనుకుని గంటకు 5కి.మీ. వేగంతో వాయుగుండం కదులుతుంది. ఒడిషాలోని చాంద్ బలి దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దాని ప్రభావం ఏపీ,తెలంగాణాలపై ఉండనున్నట్లు వాతావరణ శాఖా అధికారులు తెలుపుతున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మూడు రోజులుగా ముసురు ముసుగులో ఉన్న విహాయం తెలిసిందే. ఉత్తరాంధ్ర గంటకు 45-55కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో సముద్రం […]
ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఒక్కొక్కరిగా విచారిస్తున్న ఈడీ ముందుకు నేడు నటుడు నవదీప్ అలాగే ఎఫ్ క్లబ్ మేనేజర్ వెళ్లనున్నారు. ఈ ఇద్దరిని కలిపి ఈడీ విచారించనుంది. అయితే నేడు మరోసారి విచారణకు రావాలని కెల్విన్ కి ఈడీ ఆదేశాలు ఇచ్చింది. అయితే మొత్తం ఈ కేసు ఎఫ్ క్లబ్ చుట్టూ తిరుగుతుంది. ఎఫ్ క్లబ్ మేనేజర్ ద్వారా కెల్విన్ నుండి చాలా మంది నటులు […]
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 78,226 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 43,222 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 197.0114 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి […]
బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయిన వ్యక్తి సరయు. బిగ్ బాస్ షో కు సంబంధించి గతంలో కంటే సీక్రెసీ మెయిన్ టైన్ చేస్తామని నిర్వాహకులు చెప్పినా… ఎలిమినేట్ అయిన వ్యక్తి ఇలా బయటకు రాగానే అలా వారిపేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ రకంగా నిన్న రాత్రి నుండి ఈ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతోంది సరయు అనే ప్రచారం జరిగిపోయింది. దాన్ని బలపరుస్తూ సరయు బిగ్ […]
మన దేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక మన ఇండియాలో జరిగే పెళ్లిళ్ల సీజన్‌లో పసిడికే డిమాండ్ ఎక్కువ. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 43,990 కి […]
కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి హిందు శ్రీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరికలు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నికాసైన బిసి బిడ్డా గెల్లు శ్రీనివాస్. బిసిలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. బిసిల కోసం టీఆరెఎస్ ప్రభుత్వం మూడు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించింది. బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసినం.బిసిలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే […]