Bigg Boss 8 Telugu: సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 8లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 8 ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది. మొత్తం 4 మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. మొదటివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా.. రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పృథ్వీ లేదా అభయ్ నవీన్ షో నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ ప్రకారం వీరిద్దరు వెనుకంజలో ఉన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో అభయ్ తనకు తాను సెల్ఫ్ నామినేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఊహించని రీతిలో అభయ్ బయటకు వస్తాడు అని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అది కూడా ఎల్లో కార్డు తీసుకుని బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Read Also: Mohan Babu: ఆ విషయం తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయా..
అందుకు కారణం అభయ్ నోటి దురుసేనని.. అభయ్ బిగ్‌బాస్‌ను నోటికి వచ్చినట్లు మాట్లాడేశారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అభయ్ ఈ వారం బిగ్‌బాస్‌ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టేశారు. బిగ్‌బాస్‌కు బుర్రలేదని, ఏది తోస్తే అది చేస్తున్నాడని, అసలు కనీసం క్లారిటీ లేదంటూ బిగ్‌బాస్‌ను తిట్టేశాడు. అలా తిట్టడమే కాకుండా ఆయన బయట ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలోనూ బిగ్‌బాస్ గురించి ఈ విషయాలు చెప్తానంటూ మాట జారాడు. ఆ మాటలకు బిగ్‌బాస్ ఒకటికి రెండు సార్లు అభయ్‌ను హెచ్చరించినా పద్ధతి మారలేదు. నోటి దురుసు తగ్గించుకోకపోవడంతో అభయ్‌ను బిగ్‌బాస్ డైరెక్ట్‌గా తిట్టేశాడు. ఈ రోజు ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను అక్కినేని నాగార్జునతో చిత్రీకరించనున్నారు.
Read Also: Janhvi Kapoor: కరణ్ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్రలో దేవర స్టార్ జాన్వీ కపూర్
ఈ సీజన్‌లో హౌజ్‌లో ఉన్న వారు గొడవలతో కాలక్షేపం చేస్తున్నారు తప్పించి.. టాస్కులు ఆడడం, ఎంటర్‌టైన్ చేయడం వంటి మాటే లేదని,.. దీంతో షో చూడాలంటేనే విసుగొస్తోందని ప్రేక్షకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల్లో షో పట్ల క్యూరియాసిటీని పెంచేందుకు సీజన్ 7 మాదిరిగా వైల్డ్ కార్డు ఎంట్రీలు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వారు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచబడినట్లు వార్తలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. మొత్తం ఏడుగురు వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కొత్త కంటెస్టెంట్లతో పాటు గత ఏడు సీజన్లలో పార్టిసిపేట్ చేసిన కొంత మంది కంటెస్టెంట్లు కూడా వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డు ద్వారా హరితేజ, రోహిణి, అవినాష్, శోభాశెట్టి, టేస్టీ తేజ పేర్లు కన్‌ఫార్మ్ అయినట్లు సమాచారం. ఇక కొత్తవాళ్లుగా రీతూ చౌదరి, సీరియల్ నటి కావ్య కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.