Mobile tower stolen: సాధారణంగా వాహనాలు, ఆభరణాలు, సెల్‌ఫోన్లు, డబ్బులు, విలువైన వస్తువులు చోరీకి గురవుతుంటాయి. కానీ మహారాష్ట్రలో దొంగలు ఏకంగా సెల్ టవర్‌నే ఎత్తుకెళ్లారు. మీరు చదివింది నిజమే..సెల్‌ఫోన్ కాదు సెల్ టవర్‌నే ఎత్తుకెళ్లిపోయారు. అంత ఎత్తులో ఉండే సెల్ టవర్‌ను పార్టుపార్టులుగా విడదీసి దోచేశారు. మహారాష్ట్రలోని వాలూజ్‌లో జరిగిన ఈ దొంగతనం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విచిత్ర దొంగతనం వల్ల సదరు టవర్ కంపెనీకి దాదాపు రూ.35 లక్షల మేర నష్టం వాటిల్లింది.
Cruise Ship: క్రూజ్ షిప్‌లో కరోనా కలకలం.. 800 మందికి పాజిటివ్
మహారాష్ట్రలోని వాలూజ్‌లో జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ సెల్‌టవర్ ఏర్పాటు చేసింది. 2009లో కొంత స్థలాన్ని పదేళ్ల పాటు లీజుకు తీసుకుని అందులో ఏర్పాటు చేయగా.. ఆ భూమి యజమానికి నెల నెలా రూ.9500 అద్దె చెల్లించేది. పదేళ్ల గడువు పూర్తికాకముందే 2018లో సదరు భూమి యజమాని జీటీఎల్ కంపెనీని ఖాళీ చేయించాడు. ఆ తర్వాత ఆ టవర్ గురించి జీటీఎల్ సంస్థ పట్టించుకోలేదు. సంస్థ ఉద్యోగులు కూడా అటువైపు తొంగిచూడలేదు. వాలూజ్ చుట్టుపక్కల ఏరియాకు జీటీఎల్ కంపెనీ కొత్త ప్రతినిధిగా అమర్ లాహోత్‌ను నియమించింది. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన లాహోత్ టవర్ ఉన్న స్థలాన్ని పరిశీలించారు. అక్కడ టవర్ కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదుకు నిరాకరించారు. అమర్ లాహోత్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో వాలూజ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రూ.34,50,676 విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు అమర్ లాహోత్ ఫిర్యాదులో పేర్కొన్నాడు .