Cylinder Blast: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పెళ్లి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. భుంగ్రా గ్రామంలో గురువారం జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మహిళలు, పిల్లలు సహా 60 మంది వివాహ అతిథులు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉండగా.. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం భుంగ్రా నుంచి వరుడి ఊరేగింపు ప్రారంభం కావడానికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.
Youngest Mayor: రికార్డు సృష్టించిన విద్యార్థి.. 18 ఏళ్లకే మేయర్‌గా ఎన్నిక
భుంగ్రా గ్రామంలో పెళ్లి సందర్భంగా ఇంటికి మంటలు అంటుకోవడంతో దాదాపు 60 మంది గాయపడ్డారని.. ఇది చాలా తీవ్రమైన ప్రమాదమని కలెక్టర్ అన్నారు. గాయపడిన 60 మందిలో 42 మందిని ఎంజీహెచ్ ఆసుపత్రికి తరలించారని… చికిత్స కొనసాగుతోందన్నారు. ఈ విషయంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.