రష్యాలోని ఓ వృద్ధుల గృహంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సైబీరియాలోని కెమెరోవో నగరంలో వృద్ధుల గృహంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించి 20 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణకు ఏర్పాటైన ఆర్మగస్వామి కమిషన్ తన నివేదినకను ఈ ఏడాది ఆగస్టు 25న సీఎం స్టాలిన్‌కు సమర్పించిన సంగతి విదితమే. కానీ జయలలిత మరణం ఇప్పటికి మిస్టరీనే. తాజాగా దివంగత సీఎం మరణంపై ఆమెకు ఆప్తమిత్రురాలైన వీకే శశికళ కీలక వ్యాఖ్య చేశారు.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని దేవతా విగ్రహాలకు నిత్యం ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన వారణాసి కోర్టు సవాల్ చేస్తూ జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తన తీర్పును రిజర్వ్ చేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీలోకి అడుగుపెట్టింది. హర్యానాలోని బదర్‌పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది.
కరోనా కొత్త వేరియంట్ కలవరపెడుతున్న వేళ కేంద్రం దృష్టి సారించింది. కొవిడ్ నివారణ చర్యలను చేపట్టాలని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్‌గా రవీందర్ సింగ్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. తనకు ఇంతటి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఋణపడి ఉంటానని రవీందర్ సింగ్ అన్నారు.
తెలంగాణ సర్కార్ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం విజయవంతంగా అమలవుతుండగా.. కొత్తగా ‘కేసీఆర్ పౌష్టికాహార కిట్ల’ను రూపొందించింది. గర్భిణుల్లో రక్తహీనత అత్యధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో తొలి విడతగా వీటి పంపిణీని ప్రారంభించారు.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుంచి కిట్లు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.
ముంబై సమీపంలోని వసాయ్ వద్ద ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. స్థానిక నివాసితుల ప్రకారం.. ఈ దాడి పంది మాంసం వ్యాపారం నేపథ్యం రెండు గ్రూపుల మధ్య జరిగిన వివాదమని తెలిస్తోంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వసాయ్ పరిసరాల్లో ఈ దాడికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
అండమాన్ దీవుల సమీపంలో ఓ పడవలో 100 మంది రోహింగ్యాలు చిక్కుకుపోయారని.. దాదాపు 16 నుంచి 20 మంది దాహం, ఆకలి లేదా నీటిలో మునిగి చనిపోయి ఉండొచ్చని మయన్మార్ రోహింగ్యా ఉద్యమకారులు తెలిపారు.