Ethnic Fighting in South Sudan: దక్షిణ సూడాన్‌లోని తూర్పు జోంగ్లీ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు జరిగిన జాతి పోరులో 56 మంది మృతి చెందారు. న్యూర్ కమ్యూనిటీకి చెందిన యువకులు మరొక జాతికి చెందిన వారిపై చేసిన దాడిలో చాలా మంది మరణించారని స్థానిక అధికారి మంగళవారం వెల్లడించారు. 2011లో సూడాన్ నుండి స్వాతంత్య్రం పొందిన దక్షిణ సూడాన్‌లో పశువులు, భూమి కోసం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన జాతి పోరుల 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
Nora Fatehi: సముద్రపు ఒడ్డున సాగర కన్య.. మనోహరీ అందాలు చూడతరమా
గుమురుక్ కౌంటీ, లికుయాంగోల్ కౌంటీలో డిసెంబరు 24న ముర్లే కమ్యూనిటీపై సాయుధ న్యూర్ యువకులు దాడి చేశారని గ్రేటర్ పిబోర్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాలోని ప్రభుత్వ అధికారి అబ్రహం కెలాంగ్ తెలిపారు. పలు జాతులకు సాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా కానీ పోరాటం కొనసాగుతోందని కెలాంగ్ అన్నారు. మరణించిన వారిలో 51 మంది న్యూర్ జాతికి చెందిన వారని.. ఐదుగురు మాత్రమే ముర్లే జాతికి చెందిన వారని ఆయన చెప్పారు. గత వారం ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ (UNMISS) ముర్లే జాతి వారిపై దాడి కోసం న్యూర్ యువకులు ఆయుధాలను కూడా సమీకరించినట్లు తెలిపింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ ఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టింది.