ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి వెళ్లిన మెసేజ్.. తనకు వివాహమై భర్త పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయేలా చేసింది. ఏకంగా లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేలా రప్పించింది. భార్య కనిపించకపోవడంతో భర్తకు అనుమానం మొదలై విచారించగా.. ట్విస్ట్‌లు బయటపడ్డాయి.
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థుల కల నేటితో నెరవేరనుంది. తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు. మొత్తం 10,006 మంది నియామక పత్రాలను అందుకోనున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. బాసర సరస్వతి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు వస్తారని అంచనా.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు అందాయి. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ, అలాగే ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు.
జీవితాంతం తోడునీడలా కలిసి జీవిస్తామని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. జీవిత ప్రయాణంలో ఎన్ని కష్టాలెదురొచ్చినా చివరి వరకు కలిసి ఉంటామని పెళ్లితో ముందడుగు వేస్తారు. ఈ జీవిత ప్రయాణంలో తన తోడును కోల్పోతే ఆ బాధ వర్ణణాతీతం. కేవలం దానిని అనుభవించేవారికే దాని విలువ తెలుస్తుంది. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాదు.
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల్ని మరింత పెంపొందించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (Food Safety and Standards Authority of India)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.88.41 కోట్లతో మంగళవారంనాడు ఢిల్లీలో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జి.కమలవర్ధనరావు, ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సి.హరికిరణ్, ఎఫ్ఎస్ఎస్ఎఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇనోషి శర్మ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
పిఠాపురంలో మైనర్ బాలికకు మద్యం తాగించి బలాత్కారం చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. దీనిపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళలకు భద్రత లేదా అంటూ ప్రశ్నింస్తోంది. ఇదే విషయమై వైసీపీ అధికార ప్రతినిధి రోజా కూడా పవన్ కల్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉపముఖ్యమంత్రి ఇలాకాలోనే మైనర్ బాలికపై దారుణం జరిగితే చర్యలేవంటూ ప్రశ్నించారు. ఈ మేరకు మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా పవన్‌కు ట్వీట్ చేశారు.
ఈ రోజుల్లో పక్కనోళ్ల సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నవారే ఎక్కువ.. ఇళ్ల మీద పడి డబ్బులు, నగలు దోచుకెళ్లడం ఓల్డ స్టైల్ అయిపోయింది. దర్జాగా సిస్టమ్ ముందు కూర్చుని లూటీ చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు సైబరాసురులు. తాజాగా రాయచోటిలో ఓ ప్రైవేట్ డాక్టర్ సైబర్ నేరగాళ్లు ఉచ్చులో ఇరుక్కున్నాడు.