Basara: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. బాసర సరస్వతి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు కాళరాత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. విశేష మూలానక్షత్ర యుక్త అష్టోత్తరనామార్చన – కిచిడి నివేదన నిర్వహించనున్నారు.
Read Also: PM Modi: నవరాత్రి సమయంలో హర్యానాలో విక్టరీ సాధించడం శుభసూచకం
వేకువ జాము నుంచే భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. అమ్మవారి జన్మ నక్షత్రం, మూల నక్షత్రం విశిష్ట దినం కావడంతో ఇవాళ చిన్నారుల అక్షర శ్రీకర పూజలకు భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు, క్యూలైన్లలో ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొన్నారు. 200 వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.