పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని పవన్ తెలిపారు.
రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ బిజీబిజీగా ఉన్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక కోసం ప్రజల భాగస్వామ్యం కోసం అభిప్రాయ సేకరణ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. యాభై వేల ప్రజల నుంచి విభిన్న ఆలోచనలతో అభిప్రాయ సేకరణ జరిగిందని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కమర్షియల్ క్రాప్స్ పండించే రైతన్నకు భరోసాగా ఈ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆ నియోజకవర్గం కేరాఫ్‌గా మారింది! దగ్గరుండి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తగినశాస్తే జరిగిందని ఒక బ్యాచ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది! వలస వచ్చిన వారికే ప్రియారిటీ ఇస్తున్నారని.. పాత వాళ్లను పాతరేశారని భగ్గున మండుతున్నారు. ఇంతకూ కొత్త, పాత నేతలుగా వారంతా ఎందుకు విడిపోయారు? సీనియర్లను పక్కన పడేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు?
మేం ఆడుతాం అని వీళ్లు! మిమ్మల్ని ఆడనివ్వం వాళ్లు! పర్మిషన్ ఉందని వీళ్లు! అయినా సరే ఆటలు సాగనివ్వం అని వాళ్లు! అధికారపార్టీనే అడ్డుకుంటారా అని వాళ్లు! ఎవరైతే నాకేంటి అని వీళ్లు! ఇదీ అక్కడి క్లబ్బుల్లో జరుగుతున్న వార్! ఇంకా క్లారిటీ కావాలంటే.. ఛలో కొవ్వూరు!
గుంటూరు కలెక్టరేట్‌లో కౌలు రైతుల చట్టంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల చట్టంపై ఐదు జిల్లాల వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.
తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ.11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయని సీఎం తెలిపారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. గల్ఫ్ వర్కర్స్‌కు ఐదులక్షల పరిహారం ప్రకటిస్తూ ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. గల్ఫ్‌కి వెళ్లి చనిపోయిన కార్మికుడికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తిరుమలలోని దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధురి ఫోటో షూట్ చేశారు. మాడవీధులు, పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఫోటోషూట్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మాధురి యాక్షన్ చేశారు.