రాజస్థాన్ సైనిక సంక్షేమ శాఖ అమరవీరుల తల్లిదండ్రులకు 'వీర్ మాతా', 'వీర్ పితా' గుర్తింపు కార్డులను జారీ చేస్తుందని అధికారులు గురువారం తెలిపారు. రాజస్థాన్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా అధ్యక్షతన జరిగిన సైనిక్ కళ్యాణ్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం రెండు దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడితో పాటు అతడి కుటుంబసభ్యులు హత్యకు గురికాగా.. మరో ఘటనలో పార్టీ మద్దతుదారు హత్యకు గురయ్యారు. ఓ ఘటన ఉత్తర బెంగాల్‌లో జరగగా.. మరొకటి నదియా జిల్లాలో జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సోమవారం రాత్రి ఓ వ్యక్తి కడుపునొప్పితో హర్దోయ్‌లోని మెడికల్ కాలేజీలోని ఎమర్జెన్సీ వార్డుకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. వైద్యులు ఏమైందని ప్రశ్నించగా.. బహిరంగ మలవిసర్జన చేస్తుండగా తన ప్రైవేట్ పార్ట్ ప్రాంతంలో పాము కాటేసిందని, అనంతరం తన ప్రైవేట్ పార్ట్ ద్వారా పాము శరీరంలోకి ప్రవేశించిందని డ్యూటీలో ఉన్న వైద్యుడికి చెప్పాడు.
ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు.. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. ప్రాణాలు సైతం తీసేందుకు మగాళ్లు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆధారంగా రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హత వేటు వేయడంపై పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ప్రతిపక్షాలను ప్రజలు క్షమించరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పేర్కొన్నారు. కౌశాంబి మహోత్సవ్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. సమాజంలోని అన్ని వర్గాల సర్వతోముఖ సంక్షేమం కోసం 2024లో మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
దేశంలో కొవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్-19 నిర్వహణ, ప్రజారోగ్య సంసిద్ధతపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ మేరకు సూచనలు చేశారు.
రచయిత్రి, పరోపకారి సుధామూర్తి ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె సామాజిక సేవకు పద్మభూషణ్‌ను అందుకున్నారు. ఆమె ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులైన నారాయణ మూర్తి సతీమణి.
ట్విట్టర్ లోగోను మరో సారి మార్చారు సీఈవో ఎలాన్ మస్క్. ఇటీవల ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ బ్లూ బర్డ్ లోగోను మార్చి ఆ స్థానంలో క్రిప్టోకరెన్సీ డోజీకాయిన్‌కు సంబంధించిన ‘డోజీ’ మీమ్‌నుట్విట్టర్ లోగోగా మార్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
తన వద్ద శిక్షణ పొందుతున్న ముగ్గురు క్రికెటర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెట్ కోచ్ నరేంద్ర షా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. యువ క్రికెటర్లను లైంగికంగా వేధించిన కేసులో కోచ్ నరేంద్ర షాను పోలీసులు అరెస్టు చేశారు.
ఎంతసేపు సీఎం జగన్ పై నిందలు, విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎవరి పనైపోయిందో వచ్చే ఎన్నికలే చెబుతాయన్నారు.