Sudan:: సూడాన్ మరోసారి సంక్షోభంలోకి వెళ్లింది. అక్కడ ఆర్మీ, పారా మిలిటరీ మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఇరు బలగాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి. సుడాన్ రాజధాని ఖార్టూమ్ కాల్పు ల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది. ఆదివారం తెల్లవారుజామున సూడాన్ రాజధానిలో పోరాటం ఉద్ధృతంగా సాగింది. దాదాపు 56 మంది ప్రాణాలు కోల్పోగా.. 595 మంది గాయపడ్డారని డాక్టర్ల సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజాగా, అక్కడ పరిస్థితి మరింత కల్లోలంగా మారింది. ఘర్షణలు చెలరేగి రాజధాని సహా పలుచోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి.
ఆర్మీ, పారా మిలటరీ బలగాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులు చేసుకోవడంతో సామాన్య ప్రజలు ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. శనివారం సూడాన్ రాజధానిలో సైనిక, బలగాల పేలుళ్లు, కాల్పులతో దద్దరిల్లిపోయింది. వైమానిక దాడులకు తెగబడటంతో ఖార్టూమ్ విమానాశ్రయంతో పాటు చుట్టు పక్కల భవనాలు మంటలు, నల్లటి పొగలు కమ్ముకున్నాయి. అక్కడి సామాన్య ప్రజలతో పాటు విమానాశ్రయంలో ప్రయాణికులు సైతం బాంబుల మోతను తట్టుకోలేక ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. భారతీయులకు, ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని, ఇంటికే పరిమితం కావాలని, బయటకు వెళ్లడం మానేయాలని సూచించింది. అప్డేట్స్ కోసం వేచి ఉండాలని ట్వీ ట్ చేసింది.
Read Also: Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు.. మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్ అంటూ..
పారామిటిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సె స్(ఆర్ఎస్ఎఫ్)ని సాధారణ సైన్యంలో ఏకీకృతం చేయడంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దేశంలో ఆర్మీ చీఫ్‌గా ఉన్న అబ్దెల్ ఫత్తా అల్ బుర్షాన్, అతని తర్వా త నెంబర్ 2గా ఉన్న పారామిలిటరీ కమాండర్ మొహమ్మ ద్ హమ్దాన్ డాగ్లో మధ్య వారాల తరబడి తీవ్ర ఉద్రిక్తతల తర్వా త శనివారం సూడాన్‌లో హింస చెలరేగింది. ఖార్టూమ్‌లోని ఆర్ఎస్ఎఫ్ స్థావరం దగ్గర తీవ్ర ఘర్షణ హింస చెలరేగిం ది. ఈ రెండు దళాలు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
సైనిక నాయకుడు అయిన బుర్హాన్, తన తర్వా తి స్థానంలో ఉన్న ఆర్ఎస్ఎఫ్ కమాండర్‌తో కలిసి దేశాన్ని పౌర పాలన వైపు తీసుకెళ్లేందుకు, 2011 తిరుగుబాటుతో దేశంలో రేకెత్తించిన సంక్షోభాన్ని ముగించడానికి ఒక ఒప్పందానికి ఖరారు చేయడానికి చర్చ లు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ చర్చ ల్లో విభేదాలు రావడంతో ఘర్షణ మొదలైంది. ఆర్ఎస్ఎఫ్ రాజధాని నగరంతో పాటు ఇతర నగరాల్లో కూడా తన బలగాలను సమీకరించుకుంటోందని సైన్యం ఆరోపించింది. దేశాన్ని రక్షించేందుకు సైన్యం సిద్ధం అవుతోందని అధికారులు చెబుతున్నారు.