Tirupati Trust: తితిదే వ్యవహారాలను పర్యవేక్షించే తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్టుకు (టీటీడీ) శనివారం హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కోటి రూపాయల విరాళం అందించారు. సదరు భక్తుడి కోటి రూపాయల విరాళం అందిందని తితిదే వర్గాలు వెల్లడించాయి. ఎస్సార్సీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఏవీకే ప్రసాద్, ఏవీ ఆంజనేయప్రసాద్ శనివారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో విరాళాన్ని అందజేశారు.
Read Also: Adimulapu Suresh: సీఎం జగనే వైఎస్ వివేకా కేసును సీబీఐకి ఇవ్వమని చెప్పారు..
ఈ విరాళ నిధులను శ్రీవేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్ సంబంధిత కార్యక్రమాలకు వినియోగించాలని భక్తులు టీటీడీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. బడుగు, బలహీన వర్గాలకు ఉపయోగపడేలా ఆలయ ట్రస్టు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేస్తున్న దాతలకు వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.