పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫార్ డ్యాం, గైడ్ బండ్ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
తన ప్రియురాలు వేరొక వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిందని ఆమెను దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ దారుణ ఘటన హర్యానాలో ఫరీదాబాద్‌లో చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌లో 24 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు హత్య చేశాడు.
‘కామా తురాణం నభయం నలజ్జ’ అని ఎవరు చెప్పారో తెలీదు గానీ ప్రస్తుతం సమాజంలో జరిగే ఘటనలు చూస్తుంటే అది నూటికి నూరుపాళ్లు నిజమే అనిపిస్తోంది. కామంతో కళ్లుమూసుకుపోతున్న కొందరు వావివరుసలు, కుటుంబ కట్టుబాట్లు మరిచి కామాంధులుగా మారుతున్నారు.
శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ప్రకటన చేసింది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
విశాఖలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్.. నగరంలో కలకలం రేగింది. ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు కిడ్నాప్ అయ్యారంటూ ఎంపీ సత్యనారాయణ.. విశాఖ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం అధికారులు వడ ప్రసాదం అందుబాటులోకి తీసుకుని వచ్చారు. 45 గ్రాముల వడ 20 రూపాయల ధరతో భక్తులకు దేవస్థానం విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం.. మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Unknown Calls: సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలతో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నోరకాల మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈసారి సైబర్ నేరగాళ్ల వాట్సాప్‌ను తమ మోసానికి వారధిగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలామంది వాట్సాప్ యూజర్లకు తెలియని నెంబర్ నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ ఫేక్ కాల్స్ ద్వారా కొంతమంది అమాయకులను సైబర్ నేరగాళ్లు బుట్టలో వేసుకుంటున్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్ కొనుగోలుతో ఇతర దేశాల నుంచి ఫోన్ వస్తున్నట్లు భ్రమలు కలిగిస్తున్నారు. […]
వినియోగం పెరుగుతుండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరుగుతున్నాయి. తమ కస్టమర్లకు లాయల్టీ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తక్కువ ధరకే అందించిన టీవీఎస్ మోటార్స్.. ఆ లిమిటెడ్ టైం ఆఫర్‌ను టీవీఎస్ క్లోజ్ చేసింది.
హింసాత్మకమైన మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం జూన్ 20 వరకు పొడిగించబడింది. మణిపూర్ ప్రభుత్వం గురువారం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజుల పాటు జూన్ 20 వరకు పొడిగించింది.