Viral Video: తన గుడ్లను తీస్తున్న వ్యక్తిపై కొండచిలువ దాడి.. షాకింగ్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive python attacks zookeeper for trying to take her eggs: పాముతో ఆటలాడితే అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. చిర్రెత్తుకొచ్చిందా? ఒక్క దెబ్బకి కాటేస్తాయి. ఓ వ్యక్తి కొండచిలువ గుడ్లు తీయబోయాడు. అతనితో కొండచిలువ చేసిన ఫైట్ చూస్తే వణుకు పుడుతుంది. అయితే ఆయన దాని దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జే బ్రూవర్ అనే వ్యక్తి స్నేక్ జూను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భయంకరమైన సర్పాలతో కూడిన వీడియోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. బ్రూవర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో ఒళ్లు జలదరింప జేస్తున్నది. ఒక పెద్ద పాము ఆయనపై దాడి చేయగా తృటిలో తప్పించుకున్నారు.
Also Read: Viral News: ఇదెక్కడి దారుణం.. అధికారి భార్య చెప్పులిప్పించాడని అటెండర్ బట్టలిప్పించారు?
Also Read
- Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
పాములతో సరదాకి పోతే ప్రాణాలే పోతాయి. ఓ వ్యక్తి కొండచిలువ గుడ్లు లాగడానికి ప్రయత్నించాడు. అతను ప్రయత్నించిన ప్రతి సారి అది కాటేయాలని చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కొండచిలువ పెట్టిన గుడ్లు తీసుకోవడానికి జూకీపర్ జే బ్రూవర్ అనే వ్యక్తి ప్రయత్నం చేశాడు. అతను గతంలో కూడా ఇలాంటి కొన్ని వీడియోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అతను షేర్ చేసిన వీడియో నెటిజన్లను భయపెట్టింది. ఏ క్షణంలో అయినా కొండచిలువ అతనిని కాటేస్తుందేమో అని భయం కలిగించింది. ఈ వీడియో ఒకరోజు క్రితం పోస్ట్ చేసారు. 5 లక్షల వ్యూస్ దాటి దూసుకుపోతోంది. ఇక చాలామంది ఈ వీడియోపై స్పందించారు.
Also Read: Wagner Mutiny: రష్యాలో వాగ్నర్ తిరుగుబాటు.. సంచలన వ్యాఖ్యలు చేసిన జెలెన్స్కీ
‘అది విషపూరితమైనదా? జాగ్రత్త’ అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు. ఎంత పాముల సంరక్షణపై అవగాహన ఉన్నా పెంచేవారి పట్ల కూడా అవి ఒక్కోసారి కఠినంగా ప్రవర్తిస్తాయి. వాటిని రెచ్చగొట్టే విధంగా ఏ మాత్రం ప్రవర్తించినా ప్రాణాలు తీస్తాయి. కావున కొండచిలువతో జాగ్రత్త అని నెటిజన్లు జే బ్రూవర్‌కు సూచించారు. ‘మీరు తృటిలో తప్పించుకున్నారు.. లేకపోతే మీ ముఖంపై పాము కాటు వేసేది’ అని కొందరు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!